ఒంటరి మహిళపై యజమాని అత్యాచారం.. వీడియో తీసి, నీచంగా మాట్లాడుతూ...

Published : Aug 10, 2021, 09:37 AM IST
ఒంటరి మహిళపై యజమాని అత్యాచారం.. వీడియో తీసి, నీచంగా మాట్లాడుతూ...

సారాంశం

మహిళపై అత్యాచారం చేసి చిత్ర హింసలకు గురిచేసిన 8 మంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు. కన్యాకుమారి జిల్లాకు చెందిన మహిళ (36) భర్త నుంచి విడాకులు తీసుకుని బిడ్డతో కలిసి బుద్ధవ్ సంతైలోని ఓ సంస్థలో పనిచేసేది. సంస్థ యజమాని జబర్షన్ మిన్సీలాల్ ఆమె మీద లైంగిక దాడి చేసి దాన్ని వీడియో తీశాడు. 

రోజురోజుకూ మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా.. చంటిపిల్లలనుంచి ముసలివారి వరకు కామాంధుల బారిన పడుతున్నారు. ఈ మద్యకాలంలో ఈ హింసలో మరో కొత్తకోణం వచ్చి చేరుతోంది. మహిళలపై అత్యాచారం చేసి.. దాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ మరింత హింసలకు గురి చేస్తున్నారు. 

అలాంటి దారుణ ఘటనే చెన్నైలో చోటు చేసుకుంది. పనిచేస్తున్న సంస్థ యజమానే తన మీద కన్నేసి కాటేయడమే కాకుండా వీడియో తీసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. వివరాల్లోకి వెడితే.. 

మహిళపై అత్యాచారం చేసి చిత్ర హింసలకు గురిచేసిన 8 మంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు. కన్యాకుమారి జిల్లాకు చెందిన మహిళ (36) భర్త నుంచి విడాకులు తీసుకుని బిడ్డతో కలిసి బుద్ధవ్ సంతైలోని ఓ సంస్థలో పనిచేసేది. సంస్థ యజమాని జబర్షన్ మిన్సీలాల్ ఆమె మీద లైంగిక దాడి చేసి దాన్ని వీడియో తీశాడు. 

దాన్ని చూపెట్టి నీచంగా మాట్లాడుతూ.. తనను బ్లాక్ మెయిల్ చేశారని, బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో 8 మంది నిందితుల మీద కేసు నమోదు చేశారు. 
 
PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు