Corona cases in India:రెండు రోజులుగా ఇండియాలో 20 వేలకు పైగా కరోనా కేసులు

By narsimha lodeFirst Published Oct 1, 2021, 10:09 AM IST
Highlights

ఇండియాలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రెండు రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్టుగా ఐసీఎంఆర్ గణాంకాలు చెబుతున్నాయి. గత 24 గంటల్లో 26,727 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 277 మంది మరణించారు.

న్యూఢిల్లీ: ఇండియాలో (india)గత రెండు రోజులుగా కరోనా కేసులు (corona )పెరుగుతున్నాయి.  గత 24 గంటల్లో 26,727 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 277 మంది మరణించారు.ఇండియాలో మొత్తం కరోనా కేసులు  3,37,66,707కి చేరుకొంది. మరోవైపు కరోనాతో ఇండియాలో 4,48,339 మంది మరణించారు.

దేశంలో ఇప్పటివరకు 57,04,77,338 మంది నుండి శాంపిల్స్ సేకరించారు. నిన్న ఒక్క రోజే 15,20, 898 మంది నుండి శాంపిల్స్ తీసుకొన్నారు.ఇండియాలో కరోనా యాక్టివ్ కేసులు (corona active cases) 1 శాతానికి కంటే దిగువనే నమోదౌతున్నాయి. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 0.82 శాతంగా నమోదైంది. 

కేరళ రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. కేరళలో 15,914 కేసులు నమోదయ్యాయి.  122 మంది నిన్న ఒక్క రోజే కరోనాతో మరణించారు.కరోనా కొత్త కేసుల కంటే  కరోనా రోగుల రికవరీ ఎక్కువగా నమోదు కావడం కాస్త ఉపశమనం కల్గించే అంశమని వైద్య ఆరోగ్య శాఖాధికారులు చెబుతున్నారు.

 

click me!