త్వరలో కోవాగ్జిన్ కు అనుమతిపై నిర్ణయం : డబ్లూహెచ్ వో

By AN TeluguFirst Published Oct 1, 2021, 9:19 AM IST
Highlights

ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (ఈయూఎల్) నిమిత్తం భారత్ బయోటెక్ ఈ వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థకు పూర్తి స్థాయిలో సమర్పించింది. ప్రస్తుతం దీనిమీద సమీక్ష కొనసాగుతున్నట్లు డబ్లూహెచ్ వో వెల్లడించింది. అక్టోబర్ లో నిర్ణయం వెల్లడిస్తామని తాజాగా తన వెబ్ సైట్ లో పేర్కొంది. 

ప్రముఖ ఔషధ తయారీ సంస్థ భారత్ బయోటెక్ (Bharat BioTech)అభివృద్ధి చేసిన కోవిడ్ టీకా ‘కొవాగ్జిన్’కు(Covaxin)  అనుమతి మంజూరు చేసే విషయమై.. త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించిన డేటా క్రోడీకరణ ఈ ఏడాది జూన్ లోనే పూర్తయ్యింది. 

ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (ఈయూఎల్) నిమిత్తం భారత్ బయోటెక్ ఈ వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థకు పూర్తి స్థాయిలో సమర్పించింది. ప్రస్తుతం దీనిమీద సమీక్ష కొనసాగుతున్నట్లు డబ్లూహెచ్ వో వెల్లడించింది. అక్టోబర్ లో నిర్ణయం వెల్లడిస్తామని తాజాగా తన వెబ్ సైట్ లో పేర్కొంది. 

ఇదిలా ఉండగా, భారత మహిళల చెస్ నెంబర్ వన్, ప్రపంచ మూడో ర్యాంకర్ కోనేరు హంపి ప్రస్తుతం స్పెయిన్లో జరుగుతున్న ప్రపంచ మహిళల టీం చెస్ చాంపియన్షిప్ కోసం బాగా సిద్ధమైంది. అందుబాటులో ఉన్న ఆన్లైన్ పోటీల్లో చురుగ్గా పోటీ పడింది. అయితే తీరా స్పెయిన్‌ ఈవెంట్‌ ఆడదాం అనుకుంటే ఆమె తీసుకున్న టీకా వల్ల ఆంక్షలు ఎదురయ్యాయి.  

ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ హంపి  భారత్లో తయారైన కోవాగ్జిన్‌ టీకా తీసుకుంది.  కానీ దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గుర్తింపు లేదు.  దీనివల్ల ఆమె స్పెయిన్‌ వెళ్లాలనుకుంటే మునుపటిలాగే కరోనా ప్రోటోకాల్ పాటించాలి. పది రోజుల పాటు క్వారంటైన్ లో గడపాలి.

Koneru Humpy : కోవాగ్జిన్ టీకా తీసుకోవడంతో... ప్రపంచ మహిళల టీం చెస్ చాంపియన్షిప్ కు హంపీకి నో ఎంట్రీ...!

ఈ విషయాలన్నీ హంపీకి స్పెయిన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తేనే తెలిసాయి. ‘నార్త్ మెసిడోనియా మీదుగా స్పెయిన్ వెళ్లాలనుకున్నా.  కానీ అక్కడ స్పెయిన్ మాదిరిగానే ఆంక్షలు ఉన్నాయి.  అక్కడా పది రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి వచ్చేది. ఆంక్షలు సడలించే అవకాశం ఉందేమోనని భారత చెస్‌ సమాఖ్య కూడా జోక్యం చేసుకుంది. కానీ వారి  ప్రయత్నం ఫలించలేదు’  అని హంపీ వివరించింది.

కోవాగ్జిన్‌పై ఉన్న ఆంక్షల వల్ల ఆమె ఓ మేటి ఈవెంట్లో పాల్గొనలేక పోయింది.  ఆమె స్థానం భర్తీ చేసేందుకు ఎంపిక చేసిన పద్మిని రౌత్ కు అదే సమస్య ఎదురైంది. కోవాగ్జిన్‌తో ఆమె కూడా స్పెయిన్ ప్రయాణం కాలేకపోయింది.  డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన కోవిషీల్డ్‌ను వేయించుకున్న వారికి 122 దేశాలు ఆంక్షలు సడలించాయి. 

click me!