గుడ్‌న్యూస్: ఇండియాలో 44 రోజుల తర్వాత తగ్గిన కరోనా కేసులు

By narsimha lodeFirst Published May 28, 2021, 10:35 AM IST
Highlights

44 రోజుల తర్వాత కరోనా కేసులు తగ్గాయి. రెండు లక్షల లోపు కరోనా కేసులు నమోదయ్యాయి. పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న లాక్‌డౌన్ ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టేలా చేశాయనే అభిప్రాయాలను వైద్య ఆరోగ్యశాఖాధికారులు వ్యక్తం చేస్తున్నారు. 
 

న్యూఢిల్లీ: 44 రోజుల తర్వాత కరోనా కేసులు తగ్గాయి. రెండు లక్షల లోపు కరోనా కేసులు నమోదయ్యాయి. పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న లాక్‌డౌన్ ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టేలా చేశాయనే అభిప్రాయాలను వైద్య ఆరోగ్యశాఖాధికారులు వ్యక్తం చేస్తున్నారు. 

గత 24 గంటల్లో 20,70,508 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో  1,86,364 మందికి కరోనా సోకింది. సుమారు 44 రోజుల తర్వాత ఈ మేరకు కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది ఏప్రిల్ 13న 1,84,364 మందికి కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 2.75 కోట్లకు పైగా నమోదయ్యాయి.ఒక్క రోజు వ్యవధిలో కరోనాతో 3,660 మంది మరణించారు. ఇప్పటివరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 31,18,895 కి చేరుకొంది. మరణాల రేటు 1.15గా నమోదైంది.

దేశంలో కరోనా యాక్టివ్ కేసులు  23,43,152  గా ఉన్నాయి.యాక్టివ్ కేసుల సంఖ్య 8.84 శాతానికి చేరింది. కరోనా కేసుల రికవరీ రేటు పెరగడం కొంత ఉపశమనంగా కన్పిస్తోంది. నిన్న ఒక్క రోజు 2,59,459 మంది కోలుకొన్నారు. రికవరీ రేటు 90.01 గా నమోదైంది. దేశంలో ఇప్పటివరకు కరోనా నుండి  2.48 కోట్ల మంది కోలుకొన్నారు. 
 

click me!