భార్యతో గొడవ.. మూడో అంతస్తు నుంచి కిందకు తోసేసి..

Published : May 28, 2021, 08:35 AM IST
భార్యతో గొడవ.. మూడో అంతస్తు నుంచి కిందకు తోసేసి..

సారాంశం

ఇద్దరు భార్యభర్తలు వాళ్లు ఉండటానికి మంచి ఇల్లు వెతుక్కోవడానికి వచ్చారు. అక్కడ ఇద్దరి మధ్యా వాగ్వాదం చోటుచేసుంది. అది కాస్త గొడవకు దారి తీసింది.

భార్యభర్తల గొడవ చివరకు ఒకరి ప్రాణం మీదకు తెచ్చింది. ఇద్దరు భార్యభర్తలు వాళ్లు ఉండటానికి మంచి ఇల్లు వెతుక్కోవడానికి వచ్చారు. అక్కడ ఇద్దరి మధ్యా వాగ్వాదం చోటుచేసుంది. అది కాస్త గొడవకు దారి తీసింది. ఈ క్రమంలో భార్యతో గొడవపడి.. చివరకు మూడో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని కోట నగరంలోని ప్రేమ్ నగర్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కోట నగరానికి చెందిన హన్స్‌రాజ్ బైర్వా (45), భార్య నిషా బైర్వా (40)భార్యాభర్తలు. వీరు ప్రేమ్ నగర్ లో అద్దె ఇల్లు చూడటానికి వచ్చి గొడవపడ్డారు. భార్యతో గొడవ పడిన భర్త హన్స్ రాజ్ తన భార్య నిషాను మూడవ అంతస్తు నుంచి కిందకు నెట్టివేశాడు. మూడో అంతస్తు నుంచి కిందపడి నిషా అక్కడికక్కడే మరణించింది. 

హన్స్ రాజ్, నిషాల మధ్య కొన్నినెలలుగా గొడవపడుతున్నారని పోలీసు అధికారి ఇబ్రహీం చెప్పారు. భార్యను నెట్టివేసిన హన్స్ రాజ్ వదినకు సమాచారం అందించి పారిపోయాడు. భార్యను చంపిన భర్త హన్స్ రాజ్ పై కేసు పెట్టి అతన్ని అరెస్టు చేసేందుకు యత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. నిషా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Aadhaar Card New Rules : 2026లో ఆధార్ అప్‌డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి !
Jobs : కేవలం జనవరి ఒక్క నెలలోనే.. లక్ష ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్దం