బాలిక పట్ల వ్యక్తి అసభ్య ప్రవర్తన: చెప్పు దెబ్బ దెబ్బలతో వదిలేసిన పంచాయతీ పెద్దలు

Published : May 28, 2021, 08:44 AM IST
బాలిక పట్ల వ్యక్తి అసభ్య ప్రవర్తన: చెప్పు దెబ్బ దెబ్బలతో వదిలేసిన పంచాయతీ పెద్దలు

సారాంశం

ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి పంచాయతీ పెద్దలు చెప్పు దెబ్బల శిక్ష విధించారు ఆ వ్యక్తిని గ్రామం నుంచి బహిష్కరిస్తూ తీర్పు చెప్పారు. ఈ సంఘటన యూపిలోని సార్దానా ప్రాంతంలో జరిగింది.

మీరట్: బాలిక పట్ల అత్యంత అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని గ్రామ పంచాయతీ పెద్దలు చెప్పు దెబ్బల శిక్ష వేసి వదిలేశారు. సార్దానాలోని ఓ గ్రామంలో 60 ఏళ్ల వ్యక్తి 11 ఏళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అతన్ని చెప్పు దెబ్బలు కొట్టి బహిష్కరించి వదిలేశారు. 

గ్రామ పంచాయతీ పెద్దల నిర్ణయం తర్వాత ఆ సంఘటన పోలీసుల దృష్టికి వచ్చింది. సోమవారంనాడు బాలిక తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన సమయంలో రాజ్ కుమార్ అనే పక్కింటి వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. 

ఓ వ్యక్తి గమనించి అతన్ని పట్టుకున్నాడు. దాంతో పంచాయతీ పెద్దలు ముందుకు వచ్చారు.ఇద్దరు భిన్నమైన వ్యక్తులు వాదులాటకు దిగారు. దాంతో మర్నాడు పంచాయతీ పెద్దలు రంగ ప్రవేశం చేశారు. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 60 ఏళ్ల వృద్దుడికి చెప్పు దెబ్బల శీక్ష విధించి, గ్రామం నుంచి బహిష్కరిస్తూ తీర్పు చెప్పారు. 

ఆ తర్వాత విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. పోలీసులు రాజ్ కుమార్ మీద కేసు నమోదు చేశారు. అయితే, గ్రామ పంచాయతీ పెద్దల తీర్పు గురించి తమకు తెలియదని పోలీసులు అంటున్నారు.  

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?