ఇండియాలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

By narsimha lodeFirst Published Jun 3, 2021, 9:52 AM IST
Highlights

 ఇండియాలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. వరుసగా రెండో రోజూ కూడ కరోనా కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో 1.34 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో  కరోనా కేసుల సంఖ్య 2,84,41986కి చేరుకొంది.

న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. వరుసగా రెండో రోజూ కూడ కరోనా కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో 1.34 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో  కరోనా కేసుల సంఖ్య 2,84,41986కి చేరుకొంది.గత 24 గంటల వ్యవధిలో 2,887 మంది కరోనాతో మరణించారు. దేశంలో వరుసగా నాలుగు రోజులుగా రెండు వేలకు పైగా కరోనా మరణాలు చోటు చేసుకొన్నాయి. కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,37,989కి చేరుకొంది. 

దేశంలో తమిళనాడులో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో  25,317 కేసులు రికార్డయ్యాయి. 19,760 కేసులతో కేరళ నిలిచింది. మహారాష్ట్రలో 15,169 కేసులు రికార్డయ్యాయి.కర్ణాటకలో 19,661 కేసులు నమోదయ్యాయి.   ఆంధ్రప్రదేశ్ లో 12,768 కేసులు నమోదు కాగా, పశ్చిమబెంగాల్ లో 8,923 కేసులు రికార్డయ్యాయి.

కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ లు కొనసాగుతున్నాయి.  దీంతో  దేశంలో కరోనా కేసులు  4 లక్షల నుండి తగ్గుముఖం పట్టాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గినా కరోనాతో మరణించేవారి సంఖ్య పెరుగుతున్నాయి. 


 

click me!