తమిళనాడులో విషాదం: కరోనా భయంతో ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

Published : Jun 03, 2021, 09:27 AM IST
తమిళనాడులో విషాదం: కరోనా భయంతో   ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

సారాంశం

 కరోనా భయంతో తమిళనాడు రాష్ట్రంలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకొంది.  జ్వరంతో బాధపడుతున్న కుటుంబం  కరోనా భయంతో ఆత్మహత్య  చేసుకొంది.

చెన్నై:  కరోనా భయంతో తమిళనాడు రాష్ట్రంలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకొంది.  జ్వరంతో బాధపడుతున్న కుటుంబం  కరోనా భయంతో ఆత్మహత్య  చేసుకొంది.చెన్నైలో భార్యభర్తలు, కూతురు నివాసం ఉంటున్నారు. కొన్ని రోజులుగా వీరంతా అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో మందులు వాడారు. అయినా తగ్గలేదు. కరోనా భయంతో తల్లిదండ్రులు, కూతురు ఇంట్లో ఉరేసుకొని బుధవారం నాడు రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కరోనా వస్తే వైద్యుల సూచనలతో మందులు వాడితే  తగ్గిపోతోంది. కానీ కరోనా వచ్చిందనే  భయంతో ఆత్మహత్యలకు  పాల్పడిన ఘటనలు చోటు చేసుకొంటున్నాయి.

అయితే కరోనా భయంతో ఎవరూ కూడ ఆత్మహత్యలకు పాల్పడవద్దని వైద్య ఆరోగ్య శాఖాధికారులు సూచిస్తున్నారు.  ఇలాంటి వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇస్తే ఆత్మహత్యల వరకు వెళ్లకుండా అడ్డుకోవచ్చనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో కరోనా కేసులు అత్యధికంగా నమోదౌతున్నాయి. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదౌతున్న రాష్ట్రాల్లో తమిళనాడు అగ్రస్థానంలో నిలుస్తోంది. దీంతో రాష్ట్రంలో లాక్‌డౌన్ ను  అమలు చేస్తోంది స్టాలిన్ సర్కార్.

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?