Coronavirus in India: భారత్‌లో పెరిగిన కరోనా మరణాలు.. స్వల్పంగా తగ్గిన కొత్త కేసులు..

Published : Jan 29, 2022, 09:52 AM IST
Coronavirus in India: భారత్‌లో పెరిగిన కరోనా మరణాలు.. స్వల్పంగా తగ్గిన కొత్త కేసులు..

సారాంశం

భారత్‌లో కరోనా వైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతుంది. అయితే గత రెండు మూడు రోజులుగా కొత్త కేసులు సంఖ్య స్వల్పంగా తగ్గుతుంది. అయితే మరణాల సంఖ్య మాత్రం పెరిగింది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,35,532 కోవిడ్ కేసులు (Covid cases) నమోదయ్యాయి. 

భారత్‌లో కరోనా వైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతుంది. అయితే గత రెండు మూడు రోజులుగా కొత్త కేసులు సంఖ్య స్వల్పంగా తగ్గుతుంది. అయితే మరణాల సంఖ్య మాత్రం పెరిగింది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,35,532 కోవిడ్ కేసులు (Covid cases) నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులో భారత్‌లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,08,58,241కి చేరింది. తాజాగా కరోనాతో 871 మంది మృతిచెందారు. అయితే తాజాగా మరణాల్లో గత 24 గంటల్లో 613 మంది మృతిచెందగా.. కేరళ ప్రభుత్వం 258 బ్యాక్ లాగ్ మరణాలు నమోదు చేసింది. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,93,198కి పెరిగింది. 

గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 3,35,939 కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,83,60,710కి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 20,04,333గా ఉంది. ఇక, తాజా నమోదైన కొత్త కేసులలో.. కేరళలో అత్యధికంగా కేరళలో  54,537, కర్ణాటకలో 31,198, తమిళనాడులో 26,533, మహారాష్ట్రలో 24,948, ఆంధ్రప్రదేశ్‌లో 12,561  కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులలో దాదాపు 63.59 శాతం ఈ ఐదు రాష్ట్రాల నుంచే ఉన్నాయి. కేవలం కేరళలోనే 23.15 శాతం కేసులు ఉన్నాయి.

మరోవైపు దేశంలో కరోనా రోజువారి పాజిటివిటీ రేటు 13.39 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేటు 16.89 శాతంగా ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 93.89 శాతంగా, యాక్టివ్ కేసులు.. 4.91 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉంది. ఇక, దేశంలో శుక్రవారం (జనవరి 28) రోజున 17,59,434 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 72,57,74,705 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా తెలిపింది. 

మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. నిన్న దేశంలో 56,72,766 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో దేశంలో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,65,04,87,260కి చేరింది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా.. అర్హులైన వారికి కోటి బూస్టర్‌ డోసులు (ప్రికాషస్‌ డోస్‌) ఇచ్చినట్టుగా శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా వెల్లడించారు. కేవలం 19 రోజుల్లోనే ఈ ఘనత సాధించినట్టుగా చెప్పారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?