
తన భర్త కామాంధుడిలా మారి కన్నకూతురినే లైంగికంగా వేధించాలని అనుకున్నాడు. అతని నుంచి కూతుర్ని కాపాడేందుకు ఆమె ఏకంగా.. భర్తను నరికి చంపేసింది. ఈ సంఘటన చెన్నై నగరంలోని ఒట్టేరిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సదరు మహిళ.. తన భర్తను చంపిన తర్వాత... రక్తంతో నిండిన సుత్తిని తీసుకొని మరీ పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడం గమనార్హం. మహిళ చెప్పిన వివరాల ప్రకారం.. ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం హత్యా నేరం కింద కేసు నమోదు చేసి.. మిగిలిన వివరాల కోసం ఆమెను దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
అయితే... దర్యాప్తు అధికారులు.. సదరు మహిళను అరెస్టు చేయడానికి నిరాకరించడం గమనార్హం. ఆమె తన కూతుర్ని కాపాడే క్రమంలో భర్తను హత్య చేసిన నేపథ్యంలో.. ఇప్పటి వరకు అయితే.. ఆమెను పోలీసులు అరెస్టు చేయలేదని డీఎస్పీ ఈశ్వరన్ చెప్పారు.
సదరు మహిళ సొంత రాష్ట్రం కేరళ కాగా.... పెళ్లి తర్వాత చెన్నైలో స్థిరపడ్డారు. దాదాపు రెండు దశాబ్దాలుగా.. ఆమె తన భర్త, అత్తమామలతో కలిసి చెన్నైలోనే ఉంటుంది. ఆమె మామగారు.. టైలర్ గా పనిచేస్తున్నారు. ఆయనే కుటుంబాన్ని పోషిస్తున్నారు. సదరు మహిళ కానీ.. ఆమె భర్త కానీ.. ఎలాంటి ఉద్యోగం కూడా చేయడం లేదు. వారి కుమార్తె.. చెన్నైలోని ఓ కాలేజీలో చదువుతుండగా.. వారి కుమారుడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.
వారి కుమార్తె ఎక్కువగా.. నానమ్మ, తాతయ్యల దగ్గరే ఉండేది. ఇటీవల వారు బంధువుల ఇంటికి వెళ్లడంతో.. తల్లిదండ్రుల దగ్గర పడుకుంది. శుక్రవారం తెల్లవారుజామున.. సడెన్ గా.. వారి కుమార్తె ఏడుపు వినపడంతో.. మహిళ లేచి చూసే సరికి అక్కడ జరుగుతున్న సంఘటన చూసి ఉలిక్కిపడింది. భర్త.. కూతురిపై బలవంతం చేస్తూ కనిపించాడు. దీంతో.. ఆమె ఆవేశం ఆపుకోలేకపోయింది. వెంటనే దగ్గరలోని సుత్తి తీసుకొని.. భర్త తలపై గట్టిగా బాదింది. ఇలా పలుమార్లు కొట్టడంతో.. తలకు తీవ్రగాయమై.... అతను మరణించాడు.
ఆ తర్వాత.. రక్తంతో నిండిన సుత్తిని వెంట పట్టుకొని.. ఆమె పోలీసు స్టేషన్ కి వెళ్లి జరిగినదంతా చెప్పి లొంగిపోయింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.