కరోనా ఎఫెక్ట్: పారాసిటమాల్ ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్

By narsimha lode  |  First Published Apr 17, 2020, 3:44 PM IST

పారాసిటమాల్ టాబ్లెట్స్ ఎగుమతులపై ఉన్న ఆంక్షలను కేంద్రం శుక్రవారం నాడు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ జారీ చేసింది.
 



న్యూఢిల్లీ:పారాసిటమాల్ టాబ్లెట్స్ ఎగుమతులపై ఉన్న ఆంక్షలను కేంద్రం శుక్రవారం నాడు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ జారీ చేసింది.

పారాసిటమాల్ టాబ్లెట్స్ కొరత రాకుండా ఉండేందుకు గాను ఈ ఏడాది మార్చి 3వ తేదీ నుండి ఈ మందుల ఎగుమతులపై కేంద్రం ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. కానీ, శుక్రవారం నాడు ఎగుమతులపై ఆంక్షలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకొంది కేంద్రం.

Latest Videos

జ్వరానికి సాధారణంగా పారాసిటమాల్ టాబ్లెట్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు. కరోనా వైరస్ ప్రపంచంలో వ్యాప్తి చెందిన నేపథ్యంలో పారాసిటమాల్ టాబ్లెట్స్ కు విపరీతమైన డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే.

పారాసిటమాల్ మందు గోళీల తయారీలో ఇండియా ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది.  ఫార్మాన్స్ పార్మాసూటికల్స్, గ్రాన్యూలల్స్, శ్రీకృష్ణ పార్మా, భారత్ కెమికల్స్ ఫ్యాక్టరీల నుండి  నెలకు 5 వేల టన్నుల టాబ్లెట్స్ ను ఎగుమతి చేసే సామర్థ్యం ఉంటుందని అంచనా.

also read:ఈ నెల 20 తర్వాత సరి-బేసి విధానంలో రోడ్లపైకి వాహనాలు:కేరళ సీఎం విజయన్

హైడ్రోక్లోరోక్విన్ కు కూడ ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోడీకి ఫోన్ చేసి హైడ్రోక్లోరోక్విన్ ను కోరాడు.అమెరికాతో పాటు ఇతర దేశాలు కూడ ఈ మెడిసిన్ కావాలని కోరిన విషయం తెలిసిందే. భారత్ కు అవసరమైన మందులను నిల్వ ఉంచి ఇతర దేశాలకు ఈ మందులను ఎగుమతి చేస్తున్నారు.
 

click me!