మహారాష్ట్రలో కరోనా పంజా: 23 మంది పోలీసులకు పాజిటివ్

By Siva Kodati  |  First Published Apr 17, 2020, 2:37 PM IST

దేశంలోనే అత్యథికంగా మహారాష్ట్రలో కోవిడ్ 19 కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబైలో విధులు నిర్వహిస్తున్న 23 మంది పోలీసులకు వైరస్ సోకింది


కరోనా మహమ్మారి కారణంగా దేశంలో రోజురోజుకి పెరిగిపోతున్నాయి. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు గాను దేశంలో లాక్‌డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. ప్రజలను ఇళ్లు దాటి బయటకు రాకుండా తీవ్రంగా శ్రమిస్తున్నారు పోలీసులు.

తొలి రెండు రోజులు సహనంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బంది... బాధ్యత లేకుండా రోడ్ల మీదకు వస్తున్న వారిపై కొరడా ఝళిపిస్తున్నారు. ఇంతలా శ్రమిస్తున్న పోలీస్ సిబ్బందిని సైతం కరోనా బారినపడ్డారు.

Latest Videos

వివరాల్లోకి వెళితే.. దేశంలోనే అత్యథికంగా మహారాష్ట్రలో కోవిడ్ 19 కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబైలో విధులు నిర్వహిస్తున్న 23 మంది పోలీసులకు వైరస్ సోకింది.

తొలుత 15 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ రావడంతో వారిని క్వారంటన్‌కు తరలించారు. వీరిని నిర్బంధ కేంద్రానికి తరలించడానికి పనిచేసిన ఏడుగురు పోలీసులు అధికారులకు కూడా వైరస్ సోకింది. వీరంతా ప్రస్తుతం కోలుకుంటున్నారని అధికారులు తెలిపారు.

కాగా పోలీసు సిబ్బంది ఆరోగ్యం దృష్ట్యా వీరికి ప్రతీ జిల్లాలోనూ ప్రత్యేకంగా మొబైల్ డిస్ ఇన్ఫెక్షన్ వ్యాన్‌ను ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్ సందర్భంగా 97 మంది పోలీసులపై దాడి చేసిన 162 మందిపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.

లాక్‌డౌన్ నిబంధలను ఉల్లంఘించిన 46,671 మందిపై కేసులు నమోదు చేసి, వారిలో 9,155 మందిని అరెస్ట్ చేశారు. అలాగే నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించిన 31,296 వాహనాలను సీజ్ చేసి, వీరి నుంచి రూ.1.7 కోట్ల జరిమానాను పోలీసులు వసూలు చేశారు. 

click me!