రెండ్రోజుల్లో మరో సర్జికల్ స్ట్రైక్స్‌కు భారత్ స్కెచ్...?

By Siva KodatiFirst Published Feb 27, 2019, 11:03 AM IST
Highlights

పుల్వామా దాడిలో 42 మంది సైన్యాన్ని కోల్పోయిన భారత్... సర్జికల్ స్ట్రైక్స్‌తో ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంది. అయితే వేల సంఖ్యలో ఉన్న ఉగ్రవాదులకు ఈ దెబ్బ సరిపోదని, వాటిని కోలుకోలేని దెబ్బ కొట్టాలని భారత్ భావిస్తోంది. 

ఈ నేపథ్యంలో మరో సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టాలని భారత అధినాయకత్వం స్కెచ్ వేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఉగ్రవాదులపై ఈ ఒక్క దాడి సరిపోదని, మున్ముందు కూడా ఇవి కొనసాగుతాయని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి గోఖలే తెలిపారు.

ఆయన మాటలు మరో సర్జికల్ స్ట్రైక్స్‌కు బలం చేకూరుస్తున్నాయి. భారత్ తమ భూభాగం మీదకు వచ్చినందుకు ప్రతీకారంతో పాక్ ఊగిపోతోంది. దీంతో భారత్‌కు ధీటైన జవాబిస్తామని ఇమ్రాన్‌ఖాన్ హెచ్చరించారు.

అయితే పాక్‌కు యుద్ధ సన్నద్ధత లేదని... అది మేకపోతు గాంభీర్యమేనని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఉగ్రవాద సంస్థల చేత భారత్‌పై భారీ విధ్వంసం చేయించేందుకు పాక్ సైన్యం, ఐఎస్ఐ కుట్ర పన్నే అవకాశం ఉంది.

దీంతో నియంత్రణ రేఖకు ఆవల పాక్ ఆక్రమిత కశ్మీర్‌‌ ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే ఉగ్రవాదులు తిరిగి కోలుకోలేరని భారత రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. 

click me!