రగిలిపోతున్న పాక్.... భారత సైన్యంపై కాల్పులు

Siva Kodati |  
Published : Feb 27, 2019, 08:26 AM IST
రగిలిపోతున్న పాక్.... భారత సైన్యంపై కాల్పులు

సారాంశం

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తమ భూభాగంలోకి చొచ్చుకు వచ్చి తమ వారిని మట్టుబెట్టడంతో పాకిస్తాన్‌తో పాటు ఉగ్రవాదులు రగిలిపోతున్నారు. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. 

మరోవైపు ఉగ్రవాదులకు మద్ధతుగా నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పుల విరమణను ఉల్లంఘించి మంగళవారం సాయంత్రం నుంచి కాల్పులు జరుపుతోంది. సరిహద్దు గ్రామాల్లోని సామాన్య పౌరులే లక్ష్యంగా రాకెట్ లాంచర్లు, మోర్టార్లు, అత్యాధునిక ఆయుధాలతో కాల్పులు జరుపుతోంది.

దీంతో పలు చోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి. పాక్ సైన్యానికి భారత సైన్యం ధీటుగా జవాబిచ్చింది. భారత్ కాల్పుల్లో పాక్‌కు చెందిన ఐదు సైనిక స్థావరాలు ధ్వంసమవ్వగా, పెద్దసంఖ్యలో పాక్ సైనికులు మరణించి వుంటారని భావిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

PMAY: తెలుగు ప్ర‌జ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. 5 ల‌క్ష‌ల ఇళ్లు కేటాయింపు
BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?