ఇమ్రాన్ లేఖపై సానుకూలంగా స్పందించిన భారత్

By Nagaraju TFirst Published Sep 20, 2018, 5:16 PM IST
Highlights

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లేఖపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. లేఖపై భారత ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇరుదేశాల విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం జరగాలని ఇమ్రాన్ ప్రధాని మోదీకి రాసిన లేఖపై స్పందించిన కేంద్రం సమావేశానికి సిద్ధమని ప్రకటించింది. 

ఢిల్లీ: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లేఖపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. లేఖపై భారత ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇరుదేశాల విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం జరగాలని ఇమ్రాన్ ప్రధాని మోదీకి రాసిన లేఖపై స్పందించిన కేంద్రం సమావేశానికి సిద్ధమని ప్రకటించింది. 

పాక్ ప్రధాని నుంచి వచ్చిన శాంతి చర్చల ప్రతిపాదనను వాస్తవమేనని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రావీష్ కుమార్ ధృవీకరించారు. ఈ నెలాఖరు నాటికి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ న్యూయార్క్‌లో భారత, పాకిస్థాన్ విదేశాంగ మంత్రులు సమావేశం కానున్నారని  తెలిపారు. అయితే ఈ సమావేశంలో ఏం చర్చించాలనేది ఇంకా  నిర్ణయించ లేదని తెలిపారు. పరస్పర అంగీకారంతో ఏరోజు ఏసమయంలో నిర్వహించాలో నిర్ణయిస్తామని తెలిపారు. 

ఇమ్రాన్ పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది మొదటి అధికారిక ప్రతిపాదన కావడం విశేషం. ఇరుదేశాలు చర్చలకు అంగీకరిస్తే యూఎన్ సమావేశంతో పాటు విదేశాంగ మంత్రుల సమావేశం కూడా జరిగే అవకాశం ఉంది. 

ఈ నెలలో జరగనున్న ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు భేటీ కావాలని ఆయన ఆకాంక్షించారు. తీవ్రవాదం, రెండు దేశాల మధ్య శాంతి సంబంధాలు వంటి అంశాలపై చర్చించేందుకు పాకిస్తాన్ సిద్ధమని పాక్‌ ప్రధాని ఆ లేఖలో పేర్కొన్నారు.

అయితే భారత్‌, పాక్ మధ్య నిర్మాణాత్మక సంబంధాల కోసం భారత్ ఎదురు చూస్తోందని ప్రధాని మోదీ ఆగస్ట్ 20న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు లేఖ రాశారు. భారత్ పొరుగు దేశంతో శాంతియుత సంబంధాలకు కట్టుబడి ఉందని మోదీ లేఖలో ప్రస్తావించారు.

ఈ వార్తలు కూడా చదవండి

మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్ లేఖ
 

click me!