కోవాక్స్ ద్వారా.. భారత్ కు 75 లక్షల మోడెర్నా టీకాలు..

By AN TeluguFirst Published Jul 20, 2021, 11:34 AM IST
Highlights

‘‘ప్రపంచవ్యాప్తంగా టీకా పంపిణీ కోసం ఏర్పాటైన కోవాక్స్ కార్యక్రమం ద్వారా భారత్ కు 7.5 మిలియన్ల మోడెర్నా టీకా డోసులను అందిచనున్నాం’’ అని సదరు వర్గాలు తెలిపాయి. అయితే ఇవి దేశానికి ఎప్పుడు చేరుకుంటాయి.. అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.

భారత్లో కరోనా థార్డ్ వేవ్ పొంచి ఉన్న వేళ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే విదేశీ టీకాలను దిగుమతి చేసుకునేందుకు కేంద్రం చర్యలు వేగవంతం చేస్తున్న విషయం తెలిసిందే.  ఇలా ఉండగా త్వరలోనే భారత్ కు 75లక్షల మోడర్నా  టీకాలు  రానున్నట్లు తెలుస్తోంది. కోవాక్స్ కార్యక్రమం ద్వారా వీటిని అందజేయనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గాలు వెల్లడించాయి.

‘‘ప్రపంచవ్యాప్తంగా టీకా పంపిణీ కోసం ఏర్పాటైన కోవాక్స్ కార్యక్రమం ద్వారా భారత్ కు 7.5 మిలియన్ల మోడెర్నా టీకా డోసులను అందిచనున్నాం’’ అని సదరు వర్గాలు తెలిపాయి. అయితే ఇవి దేశానికి ఎప్పుడు చేరుకుంటాయి.. అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఎందుకంటే విదేశీ టీకా సంస్థలకు ఇండెమ్నిటీ అంశంపై కేంద్రం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

పెగాసెస్‌పై విపక్షాల ఆందోళన: ప్రారంభమైన కొద్దిసేపటికే పార్లమెంట్ ఉభయ సభల వాయిదా

దీనిపై వ్యాక్సిన్ తయారీ సంస్థలు, ప్రభుత్వం మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇండెమ్నిటీ క్లాజ్ పై స్పష్టత  వస్తేనే గాని..  విదేశీ టీకాలు భారత్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేవు. కాగా,  భారత్ లో మోడెర్నా టీకా అత్యవసర వినియోగానికి కేంద్రం ఇటీవల ఆమోదముద్ర తెలిపిన విషయం తెలిసింది. 

ఈ టీకా డోసులు దిగుమతి చేసుకునేందుకు దేశీ ఫార్మా సంస్థ సిప్లాకు అనుమతులు మంజూరు చేసింది. మోడెర్నా డోసుల దిగుమతిపై కేంద్రం ఎప్పటికప్పుడు ఆ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోందని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ డా.వికె పాల్ ఆ మధ్య తెలిపారు. ఇండెమ్నిటీ మినహాయింపు కల్పించేందుకు విదేశీ సంస్థలకు కొన్ని షరతులు విధిస్తామని కేంద్రం చెబుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

click me!