రాజ్ కుద్రాకి ఆదాయం ఎలా వస్తుంది..? పాత వీడియో వైరల్

Published : Jul 20, 2021, 11:31 AM ISTUpdated : Jul 20, 2021, 01:46 PM IST
రాజ్ కుద్రాకి ఆదాయం ఎలా వస్తుంది..? పాత వీడియో వైరల్

సారాంశం

ముఖ్యంగా రాజ్ కుంద్రా కి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందనే ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం ఇప్పుడు వైరల్ గా మారింది.

బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్టు సంఘటన ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించిన పాత వీడియోలు కూడా వైరల్ గా మారడం గమనార్హం.

గతంలో.. శిల్పా శెట్టి,  రాజ్ కుంద్రా లు కపిల్ శర్మ టీవీ షోకి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. కపిల్ శర్మ అడిగిన ప్రశ్నలకు వారు చెప్పిన సమాధానాలు.. ముఖ్యంగా రాజ్ కుంద్రా కి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందనే ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..

 

ఆ వీడియోలో.. కపిల్ శర్మ.. రాజ్ కుంద్రాను.. ఆదాయం, లగ్జరీ లైఫ్ స్టైల్.. ఏ పనీ చేయకుండా అంత డబ్బు ఎలా సంపాదిస్తున్నారు అని అడిగాడు.

దీనికి శిల్పా శెట్టి స్పందించి...  తన భర్త నిజంగా చాలా కష్టపడతాడని.. చాలా గంటలు పాటు శ్రమిస్తాడని ఆమె చెప్పారు. కాగా... దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతుంది. కపిల్ శర్మ అడిగిన ప్రశ్నకు.. సమాధానం ఇప్పుడు దొరుకిందంటూ చాలా మంది ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

పోర్నోగ్రఫీ ద్వారానే రాజ్ కుంద్రా... ఇంత డబ్బులు సంపాదించగలగుతున్నారంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?