Asaduddin Owaisi: 'మ‌రో మ‌సీదు కోల్పోవ‌డానికి సిద్దంగా లేం..' : AIMIM చీఫ్

By Rajesh KFirst Published May 15, 2022, 4:20 AM IST
Highlights

Asaduddin Owaisi: జ్ఞాన్‌వాపి మసీదు వివాదం నేప‌థ్యంలో..  ఇప్పటికే  ముస్లింలు బాబ్రీ మసీదును కోల్పోయారు.. మరో మసీదును కోల్పోవాలని సిద్దంగా లేమ‌ని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. జ్ఞానవాపి మసీదు సర్వేపై వారాణసీ కోర్టు తీర్పు 1991 నాటి ప్రార్ధనా స్థలాల చట్టాన్ని ఉల్లంఘించడమే అన్నారు. 
 

Asaduddin Owaisi:  వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు వివాదంపై AIMIM చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తనదైన శైలీలో విరుచుక‌ప‌డ్డారు. బాబ్రీ మసీదు కూల్చివేతను.. జ్ఞాన్‌వాపి మసీదులో జరుగుతున్న సర్వేతో పోల్చారు. దేశంలో మరో మసీదు కోల్పోవ‌డానికి సిద్ధంగా లేమ‌ని తేల్చి చెప్పారు. శనివారం అహ్మదాబాద్‌లో జరిగిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో AIMIM చీఫ్ మాట్లాడుతూ.. జ్ఞానవాపి మసీదు విషయంలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఇత‌ర‌ ప్రతిపక్ష పార్టీలు ఎందుకు మౌనంగా ఉన్నాయ‌ని మండిపడ్డారు. 

ముస్లింలు కానందున ఆ పార్టీలు మౌనంగా ఉన్నాయని ఆరోపించారు.  ముస్లింలు తమ సంస్కృతిని, గుర్తింపును అనుసరించేందుకు రాజ్యాంగం అనుమతినిస్తోందని  ఒవైసీ అన్నారు. ముస్లింలు తమ ఓటు బ్యాంకు కానందున వారు ఏమీ అనడం లేదనీ. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీలను ఛాందసవాద పార్టీలుగా పేర్కొన్నారు. ముస్లింలు ఇంట్లో ముస్లింలుగా ఉండాలని, బయట ఉన్నప్పుడు వారి సంస్కృతిని అంగీకరించాలని ఈ పార్టీలు కోరుకుంటున్నాయని ఒవైసీ ఆరోపించారు.

మీ సంస్కృతిని, మీ గుర్తింపును అనుసరించేందుకు భారత రాజ్యాంగం అనుమతించిందని అన్నారు. భారత రాజ్యాంగం, చట్టబద్ధమైన పాలన ఆధారంగా దేశాన్ని నడపాలనీ.  ఇప్ప‌టికే బాబ్రీ మసీదును పోగొట్టుకున్నామని, మరో మసీదును పోగొట్టుకోబోమని, ప్రభుత్వానికి చెప్పడానికే తాను మీటింగ్ కు  వచ్చానని ఒవైసీ అన్నారు. బాబ్రీ మసీదును చాకచక్యంగా లాక్కున్నారు, న్యాయాన్ని చంపారు, కానీ గుర్తుంచుకోండి, మీరు ఇప్పుడు మరో మసీదును లాక్కోలేరు. జ్ఞానవాపి మసీదు మసీదుగా ఉందని, అలాగే ఉంటుందని అన్నారు. జ్ఞానవాపి మసీదు సర్వేపై వారాణసీ కోర్టు తీర్పు 1991 నాటి ప్రార్ధనా స్థలాల చట్టాన్ని ఉల్లంఘించడమే అన్నారు. ముస్లింలు ప్రభుత్వాన్ని మార్చలేరని, ఈ దేశానికి ఎప్పుడూ ముస్లిం ఓటు బ్యాంకు లేదని అన్నారు.

అదే సమయంలో, గుజరాత్‌లో తమ పార్టీ చాలా స్థానాల్లో పోటీ చేస్తుందని, మేము విజయం సాధిస్తామని ఒవైసీ అన్నారు. అలాగే ఎన్నికలకు సన్నద్ధమవుతున్నామని చెప్పారు. గుజరాత్‌లోని ముస్లింలు "రాజకీయ శక్తి"గా ఎదగాలని,  తన పార్టీని బలోపేతం చేయాలని కోరారు.  మత శక్తులు కేవలం బిజెపికి మాత్రమే పరిమితం కాదనీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీలను కూడా కలిగి ఉన్నాయని ఆరోపించారు. 

click me!