ఫార్మాలిటీలు పూర్తయితే.. ఇండియా పేరుమార్పును స్వీకరిస్తాం: ఐరాస

By Mahesh K  |  First Published Sep 8, 2023, 7:29 PM IST

ఫార్మాలిటీలు పూర్తయితే.. ఇండియా పేరును తమ రికార్డుల్లోనూ మారుస్తామని ఐక్యరాజ్య సమితి తెలిపింది. పేరు మార్చుకున్నట్టు తమకు సమాచారం ఇస్తే తాము కూడా మారుస్తామని వివరించింది. ఇక్కడ జరిగే చర్చపై తాము కామెంట్ చేయబోమని స్పష్టం చేసింది. ఇది వరకు పలు దేశాల పేర్లు కూడా ఇలాగే తమ రికార్డుల్లో మార్చుకున్నామని చెప్పింది.
 


న్యూఢిల్లీ: జీ 20 శిఖరాగ్ర సదస్సు రేపటి నుంచి మన దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సు కోసం ఐరాస ప్రతినిధులు కూడా విచ్చేశారు. ఇదే సందర్భంలో దేశంలో ఇండియాను భారత్‌గా పేరు మార్చడం చర్చ జరుగుతున్నది. జాతీయ మీడియాతో ఐరాస సెక్రెటరీ జనరల్ ప్రధాన ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ మాట్లాడారు. ఈ పేరు మార్పుపై భారత్ తన ఫార్మాలిటీలు అన్ని పూర్తి చేసుకుని తమకు సమాచారం అందిస్తే.. తాము ఐరాస రికార్డుల్లో పేరును మారుస్తామని వివరించారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీ 20 శిఖరాగ్ర సదస్సు ప్రతినిధులకు విందు కోసం పంపిన ఆహ్వాన పత్రంలో ఈ పేరు మార్పు తొలిగా కనిపించింది. అందులో ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉన్నది. సాధారణంగా ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఉండాలి. దీనితో పేరు మార్పుపై అనుమానాలు, చర్చలు మొదలయ్యాయి. దీనిపై స్పందిస్తూ.. ఈ డిబేట్ పై యూఎన్ కామెంట్ చేయబోదని డుజారిక్ అన్నారు. ఇక్కడ ఫార్మాలిటీలు అన్నీపూర్తయ్యాక ఐరాస కూడా రికార్డుల్లో పేరు మార్పును పూర్తి చేస్తుందని వివరించారు. ఇది కేవలం ఉద్యోగులస్థాయిలో పూర్తయ్యే విషయం అని తెలిపారు.

Latest Videos

Also Read: ఎఫ్ఐఆర్‌లో వ్యక్తి మతాన్ని ప్రస్తావించిన పోలీసులు.. హైకోర్టు ఆగ్రహం

దేశం పేరు మార్చడం కేవలం ఇండియానే చేపట్టడం లేదని, చాలా దేశాలు పేర్లను మార్చుకున్నాయని యూఎన్ తెలిపింది. గతేడాది టర్కీ దాని పేరును తుర్కియేగా మార్చుకుంది. చాలా దేశాలు రాజకీయ, సాంస్కృతిక, లేదా ఇతర కారణాల వల్ల పేర్లు మార్చుకున్నాయని తెలిపింది.

click me!