‘‘ భారత్ చాలా ప్రమాదకరమైన దేశం’’

First Published Jun 26, 2018, 12:16 PM IST
Highlights

అమెరికా కూడా... ప్రమాదకరమే..

మహిళల విషయంలో భారత్ చాలా ప్రమాదకరమైన దేశమట. ఎందుకంటే ఇక్కడ మహిళలను లైంగిక వేధిస్తారు. బలవంతంగా బానిసలుగా చేస్తారు. ఇవన్నీ మేము చెబుతున్న మాటలు కావు. ఓ సర్వేలో వెల్లడైన విషయాలు. గ్లోబల్ ఎక్స్ పర్ట్ నిర్వహించిన పోల్ లో ఈ నిజాలు బయటపడ్డాయి. 

మహిళల సమస్యలపై దాదాపు 500మంది నిపుణులు చేపట్టిన థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ సర్వేలో ఆప్ఝనిస్థాన్, సిరియా దేశాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. వీటి తర్వాత స్థానాల్లో సోమాలియా, సౌదీ అరేబియా దేశాలు ఉన్నాయి.

ఇక వెస్ట్రన్ దేశాల విషయానికి వస్తే.. మహిళలకు రక్షణ తక్కువగా ఉన్న దేశాల్లో అమెరికా మూడో స్థానంలో  ఉండటం గమనార్హం.  ఇలాంటి సర్వేనే 2011లో ఒకసారి నిర్వహించగా.. మహిళల విషయంలో ప్రమాదకరమైన దేశాల జాబితాలో ఆప్ఝనిస్థాన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, పాకిస్థాన్, ఇండియా, సోమాలియా దేశాలు ఉన్నాయి.

‘‘ భారతదేశంలో మహిళలకు గౌరవం చాలా తక్కువగా ఉంటుందని, అత్యాచారాలు, వివాహేతర సంబంధాలు, లైంగిక వేధింపులు, బ్రూణ హత్యలు, బాల్య వివాహాలు లాంటివి ఎక్కువగా ఉంటాయి’’ అని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాధికారి ఒకరు చెప్పడం గమనార్హం.

2007-2016 మధ్యకాలంలో మహిళలపై అత్యాచారాలు 83శాతం పెరిగినట్లు సర్వేలో తేలింది. ప్రతి గంటకు నలుగురు అమ్మాయిలు అత్యాచారానికి గురౌతున్నారని నిపుణులు చెబుతున్నారు. 

అమ్మాయిల అక్రమ రవాణా, అత్యాచారాలు, బలవంతపు పెళ్లిళ్లు, బ్రూణ హత్యలు తదితర కారణాల దృష్ట్యా భారత్ మహిళల విషయంలో ప్రమాదకరమైన దేశంగా ర్యాంక్ ఇచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఆ మధ్యకాలంలో చాలామంది సెలబ్రెటీలు, సాధారణ మహిళలు తాము కూడా లైంగిక వేధింపులకు గురయ్యామనే విషయాన్ని ‘‘మీ టూ’’ అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఈ సర్వే చేసినట్లు వారు తెలిపారు. 

click me!