అప్పుడే పుట్టిన మగ శిశువును చిదిమేసిన కన్నతల్లి, ఆడపిల్ల పుట్టలేదనే అక్కసుతో...

Published : Jun 26, 2018, 11:52 AM IST
అప్పుడే పుట్టిన మగ శిశువును చిదిమేసిన కన్నతల్లి, ఆడపిల్ల పుట్టలేదనే అక్కసుతో...

సారాంశం

రివర్స్ కేసు...

అందరూ తమకు మగ పిల్లలు పుట్టాలను కోరుకుంటున్న ఈ కాలంలో ఆ మహిళ మాత్రం రివర్స్ లో ఆశపడింది. తనకు ఆడబిడ్డే పుట్టాలని కోరుకుంది. అయితే ఆవిడ కోరుకున్నట్లు ఆడపిల్ల కాకుండా మగబిడ్డ జన్మించాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ తల్లి కన్న ప్రేమను మరిచి మగపిల్లాడిని దారుణంగా హత్య చేసింది. ఈ విషాద సంఘటన మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే... ఔరంగాబాద్‌కు చెందిన ఓ మహిళకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. గర్భవతిగా ఉండగా తనకు ఆడబిడ్డ పుట్టాలని ఎన్నో దేవుళ్లకు మొక్కింది. కానీ ఆమె కోరికకు వ్యతిరేకంగా మగ పిల్లాడు పుట్టాడు. అయితే మగ శిశువు జన్మించడాన్ని జీర్ణించుకోలేని ఆ తల్లి.. కన్న కొడుకు అనికూడా దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత పసిగుడ్డు మృతదేహాన్ని ఇంటి బయట ఉన్న ఓ డ్రమ్ములో పడేసి తనకేమి తెలియనట్లుగా ఉండిపోయింది.

అయితే ఈ పిల్లాడి శవాన్ని డ్రమ్ములో గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అసలు విషయం బైటపడింది. దీంతో పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.    
 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే