IMD Twitter account hacked: షాకింగ్ ..భారత వాతావరణ శాఖ ట్విట్టర్ హ్యాక్

Published : Apr 09, 2022, 10:37 PM ISTUpdated : Apr 09, 2022, 10:39 PM IST
IMD Twitter account hacked: షాకింగ్ ..భారత వాతావరణ శాఖ ట్విట్టర్ హ్యాక్

సారాంశం

IMD Twitter account hacked: భారత వాతావరణ శాఖ కు చెందిన అధికార ట్విట్టర్‌ ఖాతాలు శనివారం హ్యాక్‌ అయ్యాయి. ఈ హ్యాక్ జ‌రిగిన‌ట్టు శనివారం సాయంత్రం జరిగిన అధికారులు గుర్తించారు. కాగా, తమ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యిందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. దానిని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.  

IMD Twitter account hacked: మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్‌కు చెందిన భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ట్విట్టర్ ఖాతాను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేసినట్లు అధికారులు శనివారం తెలిపారు. వాతావరణ శాఖ ట్విట్టర్ హ్యాండిల్‌ లో హ్యాకర్లు ఒక ప్రొమోషన్‌కు సంబంధించిన అంశాన్ని ట్వీట్‌ చేశారు. ‘బీన్జ్ అధికారిక కలెక్షన్ వేడుకలో భాగంగా రాబోయే 2 గంటల పాటు కమ్యూనిటీలోని యాక్టివ్ ఎన్‌ఎఫ్టీ వ్యాపారులందరికీ ఎయిర్‌డ్రాప్‌ను ప్రారంభించాం’ అని అందులో పేర్కొన్నారు. అలాగే...వాతావరణ శాఖ ప్రొఫైల్‌ చిత్రాన్ని కూడా హ్యాకర్లు తొలగించారు. 

అలాగే ఇతర ప్రైవేట్‌ ట్విట్టర్‌ ఖాతాలను ట్యాగ్‌ చేస్తూ పలు ట్వీట్లు కూడా చేశారు. దీంతో ఈ ఖాతా హ్యాక్ గురైన‌ట్టు అధికారులు గుర్తించారు. IMD యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌కు 2.46 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఖాతాను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. "IMD ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేయబడింది, మేము దానిని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాము" అని IMD డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర చెప్పినట్లు తెలిపారు.  భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో కొనసాగుతున్న తీవ్రమైన హీట్‌వేవ్ కారణంగా వాతావరణ శాఖ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ చాలా ట్రాఫిక్‌ను ఆకర్షిస్తోంది.

అలాగే.. శ‌నివారం  తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ కొద్దిసేపు హ్యాక్ చేయబడిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. హ్యాకర్లు UP CMO యొక్క ట్విట్టర్ హ్యాండిల్‌లో ":   BAYC/MAYCని ట్విట్టర్‌లో ఎలా ఆన్ చేయాలి" అనే ట్యుటోరియల్ నుపోస్టు చేసి పిన్ చేసారు. అలాగే.. ఒక కార్టూనిస్ట్ చిత్రాన్ని ప్రొఫైల్ పిక్చర్‌గా ఉపయోగించారు. CMO యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి వందలాది మంది ట్విట్ట‌ర్ వినియోగదారుల‌కు ట్యాగ్ చేస్తూ హ్యాకర్ అనేక ట్వీట్లను చేసిన‌ట్టు పోలీసులు గుర్తించారు. దీంతో అకౌంట్ హ్యాక్ అయిన‌ట్టు అధికారులు గుర్తించారు. అయితే, కొన్ని గంటల తర్వాత ఖాతా పునరుద్ధరించబడింది. ఈ మేరకు లక్నోలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 

శుక్ర‌వారం అర్థ‌రాత్రి స‌మ‌యంలో దాదాపు 29 నిమిషాల పాటు ఖాతా హ్యాక్ చేయబడిందని, హ్యాకర్లు దాదాపు 400-500 ట్వీట్లు పోస్ట్ చేసిన‌ట్టు  అధికారులు గుర్తించారు. అసహజ కార్యకలాపాల వ‌లన‌ ఖాతా కాసేపు నిలిపివేయ‌బ‌డిన‌ట్టు సైబ‌ర్ పోలీసులు అధికారులు తెలిపారు. అయితే, కొన్ని గంటల తర్వాత ఖాతా పునరుద్ధరించబడిన‌ట్టు అధికారులు తెలిపారు. హ్యాక్ అయిన సీఎంఓ అకౌంట్ స్క్రీన్‌షాట్‌లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా, హ్యాకర్లు ప్రొఫైల్ ఫోటోను, ఖాతాని కూడా మార్చారు. ప్ర‌స్తుతం UP CMO (@CMOfficeUP) ట్విట్టర్ ఖాతాకు ప్రస్తుతం నాలుగు మిలియన్ల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ప్రభుత్వ శాఖ లేదా ప్రభావవంతమైన వ్యక్తికి చెందిన ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ కావడం ఇది మొదటిసారి కాదు. గతేడాది డిసెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విట్టర్‌ ఖాతా కూడా హ్యాక్‌కి గురైంది. బిట్ కాయిన్‌ను ఉద్దేశిస్తూ పోస్టు చేశారు. భారత్‌లో బిట్‌కాయిన్‌ను చట్టబద్దం చేశారని, ప్రభుత్వం 500 బిట్‌కాయిన్‌లు కొనుగోలు చేసి ప్రజలకు పంచుతోందని.. తర్వపడండి అంటూ హ్యాకర్లు లింక్‌లు పోస్టు చేశారు. 

 

PREV
click me!

Recommended Stories

Nepal Flash Floods: నేపాల్ వరదల్లో కొట్టుకొచ్చిన వందలాది మృ*తదేహాలు | Asianet News Telugu
భారీ వరదల తర్వాత నేపాల్ లో ప్రస్తుత పరిస్థితి | Drone Visuals | Nepal Flash Floods | From Devi Ghat