భారత్ లో కోవిడ్ కలకలం.. ఒకే రోజు 850 కొత్త కేసులు నమోదు.. ఏడు నెలల్లో ఇదే అత్యధికం..

By Sairam Indur  |  First Published Jan 1, 2024, 1:05 PM IST

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత వారం నుంచి కోవిడ్ -19 వ్యాప్తి అధికంగా ఉంది. ఇందులో జేఎన్.1 వేరియంట్ కేసులు కూడా నమోదు అవుతున్నాయి. కేరళలో అత్యధిక కేసులు వెలుగులోకి వస్తున్నాయి.


భారతదేశంలో కోవిడ్ కలకలం రేకెత్తిస్తోంది. గత నెల రోజుల కిందట వరకు అంతంత మాత్రంగానే ఉన్న కేసులు వేగంగా పెరుగుతూ వస్తున్నాయి. 2023 డిసెంబర్ మొదటి వారంలో రెండంకెల కొత్త కేసులో నమోదు కాగా.. చివరికి వచ్చే సరికి 800 దాటింది. గడిచిన 24 గంటల్లో 850 కొత్త కేసులు నమోదు అయ్యాయి. గడిచిన ఏడు నెలల్లో ఇంత స్థాయిలో కేసులు నమోదు అవడం ఇదే మొదటి సారి.

ఇస్రో PSLV-C58 మిషన్ విజయవంతం.. 

Latest Videos

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న జేఎన్.1 సబ్ వేరియంట్ ఈ పెరుగుదలకు కారణమైంది. గత వారం రోజుల్లోనే మొత్తంగా నమోదైన కేసులు సంఖ్య 4,652గా ఉంది. అలాగే ఒకే వారంలో కరోనా వల్ల 29 మంది మరణించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గత శనివారం రోజు వారి కొత్త కేసుల సంఖ్య 841 కు పెరిగింది. అంటే సీజన్ లో మొదటి సారి కొత్త కేసుల సంఖ్య 800 మార్కును దాటింది. ఈ ఏడాది మే 18 తర్వాత ఇదే అత్యధికం.

Liquor Sales : మందుబాబులా మజాకా ! మూడు రోజుల్లో రూ. 658 కోట్లు తాగేశారు..

కాగా.. గత వారం దక్షిణాది రాష్ట్రమైన కేరళలో 3,018 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది భారత్ కేసుల్లో దాదాపు 80 శాతం. దీన్నిబట్టి కేరళలో కరోనా విజృంభణ ఇప్పటికే తారాస్థాయికి చేరిందని తెలుస్తోంది. అయితే మరి కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. కర్ణాటక, మహారాష్ట్రలో కేసులు గణనీయంగా పెరిగాయి.  కేరళ మినహా ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రమే రోజువారీ కేసులు 100 దాటాయి.

Ayodhya Ram Mandir : అందాల రామయ్యకు హైదరబాదీ పాదుకలు ...

కర్ణాటకలో గత వారం 922 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది అంతకుముందు వారం నమోదైన 309 కేసులతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ. మహారాష్ట్రలో కేసులు 103 నుంచి 620కి ఆరు రెట్లు పెరిగాయి. మొత్తం మీద, గత వారం 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.

click me!