అంతరిక్ష రంగంలో భారత్ అద్భుతాలు సృష్టిస్తోంది.. మన్ కీ బాత్‌లో ఇస్రోను ప్రశంసించిన ప్రధాని మోడీ

By team teluguFirst Published Oct 30, 2022, 2:39 PM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోడీ తన నెలవారీ మాన్ కీ బాత్ ప్రసంగంలో ఆదివారం ప్రసంగించారు. ఇందులో ఇస్రో సాధిస్తున్న విజయాలను కొనియాడారు.  ఛత్ పూజ సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు పలు విషయాలను ప్రస్తావించారు. 

అంతరిక్ష రంగంలో భారతదేశం అద్భుతాలు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారతీయ శాస్త్రవేత్తలు సొంతగా సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం  తన 'మన్ కీ బాత్' 94వ ఎడిషన్‌లో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఛత్ పూజ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. భారతదేశ సంస్కృతి, పండుగలలో ప్రకృతిని భాగస్వామ్యం చేయడంలో ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన ప్రధాని.. ఛత్ పూజ సందర్భం మన జీవితంలో సూర్యుని, సౌరశక్తి  ప్రాముఖ్యతను తెలియజేస్తుందని అన్నారు.

బీజేపీ టిక్కెట్ పై ఎన్నికల్లో పోటీ చేస్తానన్న కంగనా రనౌత్.. స్వాగతించిన జేపీ నడ్డా.. కానీ..

ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో గుజరాత్-మొధేరాలో సౌరశక్తి ప్రాముఖ్యత, పూర్తిగా సౌరశక్తితో నడిచే గ్రామం విశేషాలు, అలాగే అంతరిక్ష రంగంలో భారతదేశం ఇటీవల సాధించిన విజయాలను ప్రధాని మోడీ ప్రస్తావించారు. భారతదేశం ఇప్పుడు ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో తన సంప్రదాయ అనుభవాలను ప్రవేశపెడుతోందని, అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తిదారుల్లో ఒకటిగా మారిందని మోడీ అన్నారు. 

‘‘భారతదేశంలో సోలార్ గ్రామాల నిర్మాణం ఒక పెద్ద సామూహిక ఉద్యమంగా మారే రోజు ఎంతో దూరంలో లేదు. మోధేరా గ్రామ ప్రజలు ఇప్పటికే దీనిని ప్రారంభించారు ’’అని ప్రధాని అన్నారు.  ఇతర అభివృద్ధి చెందిన దేశాలు భారతదేశానికి క్రయోజెనిక్ టెక్నాలజీని అందించడానికి నిరాకరించాయని అన్ారు. కానీ భారతీయ శాస్త్రవేత్తలు ఆ టెక్నాలజీని సొంతంగా అభివృద్ధి చేశారని చెప్పారు. దాంతోనే ఇప్పుడు డజన్ల కొద్దీ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారని తెలిపారు. ‘‘ఈ ప్రయోగం వల్ల భారతదేశం ప్రపంచ వాణిజ్య మార్కెట్‌లో బలమైన శక్తిగా ఉద్భవించింది, ఇది అంతరిక్ష రంగంలో భారతదేశానికి కొత్త అవకాశాలను కూడా తెరిచింది ’’అని ఇస్రో ఇటీవలి ప్రయోగించిన వాణిజ్య ఉపగ్రహాన్ని ప్రస్తావిస్తూ మోడీ అన్నారు.

కాల్చేందుకు సిగరెట్ ఇవ్వలేదని స్నేహితుడి హత్య.. ఆగ్రాలో ఘటన

‘‘ఇంతకు ముందు భారతదేశంలోని అంతరిక్ష రంగం ప్రభుత్వ వ్యవస్థల పరిధికే పరిమితం అయ్యింది. కానీ దానిలోకి దేశ యువతకు, ప్రైవేట్ రంగంలోకి అనుమతి ఇచ్చినప్పుడు విప్లవాత్మక మార్పులు రావడం ప్రారంభించాయి ’’ అని తెలిపారు. ‘‘ నేను స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఎర్రకోట నుండి ‘జై అనుసంధాన్’ అని పిలుపునిచ్చాను. ఈ దశాబ్దాన్ని భారతదేశం టెక్కేడ్‌గా మార్చే విషయాన్ని నేను ప్రస్తావించాను. మన IIT విద్యార్థులు ఇప్పుడు లక్ష్యాన్ని చేజిక్కించుకున్నందుకు నేను చాలా సంతోషించాను ’’ అని ప్రధాని మోడీ అన్నారు. 

PM Shri 's with the nation. https://t.co/pgHgsKA4Wk

— BJP (@BJP4India)

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న జరుపుకునే జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ప్రధాని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన 'మిషన్ లైఫ్' ప్రచారంపై కూడా ప్రధాని మాట్లాడారు. ఈ ప్రచారం గురించి అందరూ తెలుసుకోవాలని, దానికి మద్దతు ఇవ్వాలని పౌరులను కోరారు. 

click me!