ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో 161వ స్థానానికి పడిపోయిన భార‌త్.. మీడియా సంఘాల ఆందోళ‌న

Published : May 04, 2023, 04:01 AM IST
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో 161వ స్థానానికి పడిపోయిన భార‌త్.. మీడియా సంఘాల ఆందోళ‌న

సారాంశం

World Press Freedom Index: ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్ 161వ స్థానానికి పడిపోయింది. ఈ క్ర‌మంలోనే మీడియా సంఘాలు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లో పత్రికా స్వేచ్ఛపై వార్షిక నివేదికను ప్రచురించే గ్లోబల్ మీడియా వాచ్ డాగ్ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్ఎస్ఎఫ్ ) గత ఏడాది 180 దేశాల్లో నిర్వహించిన సర్వేలో భారత్ కు 150వ స్థానం లభించింది.  

India slips to 161 on World Press Freedom Index: ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్ 161వ స్థానానికి పడిపోయింది. ఈ క్ర‌మంలోనే మీడియా సంఘాలు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లో పత్రికా స్వేచ్ఛపై వార్షిక నివేదికను ప్రచురించే గ్లోబల్ మీడియా వాచ్ డాగ్ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్ఎస్ఎఫ్ ) గత ఏడాది 180 దేశాల్లో నిర్వహించిన సర్వేలో భారత్ కు 150వ స్థానం లభించింది.

వివ‌రాల్లోకెళ్తే.. బుధవారం ప్రచురించిన వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2023లో భారత్ 11 స్థానాలు దిగజారి 161వ స్థానానికి పడిపోవడంపై దేశంలోని మీడియా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లో పత్రికా స్వేచ్ఛపై వార్షిక నివేదికను ప్రచురించే గ్లోబల్ మీడియా వాచ్ డాగ్ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్ఎస్ఎఫ్ ) గత ఏడాది 180 దేశాల్లో నిర్వహించిన సర్వేలో భారత్ కు 150వ స్థానం లభించింది. ప్ర‌స్తుతం భార‌త్ ర్యాంకు 161కి ప‌డిపోయింది. 

తజికిస్థాన్ (153వ స్థానం), భారత్ (161వ స్థానం), టర్కీ (165వ స్థానం) వంటి మరో మూడు దేశాల్లో పరిస్థితి 'సమస్యాత్మకం' నుంచి 'చాలా దారుణంగా' మారిందని ఆర్ఎస్ఎఫ్ నివేదిక తెలిపింది. "సమాచార స్వేచ్ఛా ప్రవాహాన్ని ప్రమాదకరంగా పరిమితం చేసే మరొక దృగ్విషయం ఏమిటంటే, రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న సంపన్నులు మీడియా సంస్థలను స్వాధీనం చేసుకోవడం" అని ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ప్రచురించిన ఈ నివేదిక పేర్కొంది. ఈ క్ర‌మంలోనే ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కార్ప్స్, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ప్రెస్ అసోసియేషన్ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

తాజా ఆర్ఎస్ఎఫ్ నివేదిక ప్రకారం 'భారత్ సహా పలు దేశాల్లో పత్రికా స్వేచ్ఛ సూచీలు క్షీణించాయి. లోతైన అసమానతలు ఉన్న గ్లోబల్ సౌత్ లో ప్రజాస్వామ్యాలను అభివృద్ధి చేయడంలో మీడియా పాత్రను తక్కువ అంచనా వేయలేమన్నారు. అదేవిధంగా కాంట్రాక్టరైజేషన్ వంటి ప్రతికూల పని పరిస్థితుల కారణంగా పత్రికా స్వేచ్ఛపై ఉన్న అడ్డంకులను కూడా సవాలు చేయాలి. అసురక్షిత పని పరిస్థితులు స్వేచ్ఛాయుత పత్రికా స్వేచ్ఛకు దోహదం చేయలేవు' అని పేర్కొంది.

మోడీ స‌ర్కారుపై కాంగ్రెస్ విమ‌ర్శ‌లు 

ప్ర‌పంచ ప‌త్రికా స్వేచ్ఛ సూచీల్ భార‌త్ ర్యాంకు ప‌డిపోవ‌డంపై కాంగ్రెస్ స్పందిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించింది. "ఖడ్గంపై పెన్ను బలాన్ని ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం గౌరవిస్తుంది. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఆవిర్భవించిన పత్రికలు ప్రస్తుత బీజేపీ పాలనలో భారత్ లో క్రమంగా క్షీణిస్తున్నాయి. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో భారత్ ర్యాంక్ 2014లో 140 నుంచి 2022 నాటికి 150కి పడిపోయింది. ఇది వాక్ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను, చివరికి ప్రజల స్వరాన్ని క్రమంగా అణచివేయడాన్ని సూచిస్తుంది. మీడియా స్వతంత్రతను, తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ కష్టకాలంలో జర్నలిస్టులకు అండగా నిలుస్తుంది" అని పేర్కొంది. 

 

 

టీఎంసీ నాయకురాలు మహువా మోయిత్రా సైతం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వివిధ సంవత్సరాలలో ప్రపంచ పత్రికా సూచీలో భారత్ ర్యాంకు వివరాలను ప్రస్తావిస్తూ మోడీ సర్కారును టార్గెట్ చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!