తల తెగిపడిన పాము తనను తానే కాటేసుకుంది.. భ‌యాన‌క వైర‌ల్ వీడియో !

Published : May 04, 2023, 01:37 AM IST
తల తెగిపడిన పాము తనను తానే కాటేసుకుంది.. భ‌యాన‌క వైర‌ల్ వీడియో !

సారాంశం

Scary Viral Video: ఓ విష‌స‌ర్పం తల తెగిపోయి ఉంది. అయినా ప్రాణాలు పోకపోవడంతో ఆ పాము శ‌రీరం క‌దులుతూ క‌నిపించింది. ఈ క్రమంలో పాము దేహం వచ్చి తెగిపోయి పక్కన పడివున్న తలకు తగిలింది. అంతే  ఒక్క‌సారిగా ఆ తల నోరు తెరచి తన దేహాన్ని తనే గట్టిగా కాటేసింది.  

Scary video:  పాములు త‌మ ప‌రిస‌రాల్లో ఎలాంటి అల‌జ‌డిని గుర్తించిన వెంట‌నే అప్ర‌మ‌త్తం కావ‌డం ఈ ప్ర‌కృతిలో చూస్తుంటాం. త‌మ‌పై దాడి జ‌రుగుతుంద‌ని అనిపిస్తే చాలు త‌మ ఆత్మ‌ర‌క్ష‌ణ కోసం ఇత‌ర జీవులు, జంతుజాలం పై కాటేయ‌డంతో విరుచుకుప‌డుతాయి. ఇలా కాటేయ‌డం సాధార‌ణ విష‌యమే. అయితే, ఒక విష‌పూరిత‌మైన పాము త‌న‌ను తాను కాటేసుకోవ‌డం చూశారా? అది కూడా త‌న త‌ల‌ను న‌రికిన త‌ర్వాత క‌సిగా క‌రుచుకోవ‌డం అంటే న‌మ్మ‌శ‌క్యం కాని విష‌యం. 

అయితే, ఇలాంటి ఘ‌ట‌న ఒక‌టి చోటుచేసుకుంది. ఈ భ‌యాన‌క దృశ్యాల‌తో కూడిన ఒక వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. ఒక త‌ల తెగిప‌డిన పాలు త‌న‌ను తాను క‌రుచుకోవ‌డం ఆ వీడియోలో క‌నిపించింది. ఆడ్లీ టెర్రిఫైయింగ్‌ పేరుతో ఉన్న ట్విటర్‌ హ్యాండిల్లో ఈ వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియో 15 సెకన్‌ల నిడివితో ఉంది. ఈ దృశ్యాల్లో ఓ విష‌స‌ర్పం తల తెగిపోయి ఉంది. అయినా ప్రాణాలు పోకపోవడంతో ఆ పాము శ‌రీరం క‌దులుతూ క‌నిపించింది. ఈ క్రమంలో పాము దేహం వచ్చి తెగిపోయి పక్కన పడివున్న తలకు తగిలింది. అంతే  ఒక్క‌సారిగా ఆ తల నోరు తెరచి తన దేహాన్ని తనే గట్టిగా కాటేసింది. త‌ల‌భాగం కాటేయ‌డంతో కలిగిన మంటకు పాము దేహం ఒక్కసారిగా మరింత వేగంతో కొట్టుకోవడం క‌నిపించింది.

 

 

PREV
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!