8 ఏండ్లలో చేపట్టిన సంస్కరణలతోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా భార‌త్... : ప్ర‌ధాని మోడీ

Published : Oct 22, 2022, 03:20 PM IST
8 ఏండ్లలో చేపట్టిన సంస్కరణలతోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా భార‌త్... : ప్ర‌ధాని మోడీ

సారాంశం

PM Modi: ప్రభుత్వ, పీఎస్‌యూల‌లో 10 లక్షల మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకునేందుకు డ్రైవ్‌ను ప్రారంభించిన ప్ర‌ధాని మోడీ.. తన ప్రభుత్వం ప్రపంచ సమస్యల నుండి భారతదేశాన్ని రక్షించడానికి కొత్త కార్యక్రమాలు చేప‌డుతోంద‌ని తెలిపారు.  

5th largest economy: భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందనీ, ఎనిమిదేళ్లలో దేశం 10వ స్థానం నుంచి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఎదిగింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ శ‌నివారం నాడు అన్నారు. భారతదేశం.. యునైటెడ్ కింగ్‌డమ్‌ను అధిగమించి ఈ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచిందని తెలిపారు. త్వ‌ర‌లోనే భార‌త్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఎదుగుతుంద‌ని అంచ‌నాలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 'రోజ్‌గార్ మేళా'ను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, భారతదేశం స్వావలంబన మార్గంలో ముందుకు సాగుతోంది. ఈ వేడుకలో కొత్తగా చేరిన 75,000 మంది నియామక పత్రాలను అందజేసిన‌ట్టు తెలిపారు. 

అలాగే, గత ఎనిమిదేళ్లలో భారత్ ఎనిమిదో స్థానం నుంచి ఐదో స్థానానికి ఎగబాకింది. గత ఏడు-ఎనిమిదేళ్లలో ఆర్థిక వృద్ధికి అడ్డుగా ఉన్న అడ్డంకులను తొలగించడం వల్ల ఇది సాధ్యమైంది' అని ' రోజ్‌గార్ మేళా ' కోసం నిర్వ‌హించిన‌ వర్చువల్ ఈవెంట్‌లో ప్రసంగిస్తూ ప్రధాని మోడీ అన్నారు. అనేక పెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు నేడు ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో పాటు... 100 సంవత్సరాలలో అతిపెద్ద సంక్షోభం దుష్ప్రభావాలతో పోరాడుతున్నాయని, ఇది కేవలం 100 రోజుల్లో పోదని అన్నారు.  అనేక దేశాలకు భారీ ఆర్థిక పతనాన్ని తెచ్చిన కరోనావైరస్ గురించి ఆయన ప్రస్తావించారు. ఈ స‌మ‌యంలో భార‌త్ లో మెరుగైన చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని వెల్ల‌డించారు. నేడు భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందనీ, గత 8 ఏళ్లలో చేపట్టిన సంస్కరణల కారణంగానే ఈ ఘనత సాధించిందని తెలిపారు. 

ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 10 లక్షల మందికి పైగా లక్ష్యంగా ఉంది. వారిలో 75,000 మందికి శనివారం ఆఫర్ లెటర్‌లు వచ్చాయి. "రాబోయే నెలల్లో, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి" అని ప్రధాని మోడీ నొక్కిచెప్పారు. “2014లో కొన్ని స్టార్టప్‌లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆ సంఖ్య 80,000 మార్కును దాటింది. భారతీయ సంస్థలు కూడా ఎక్కువగా స్వావలంబనగా మారుతున్నాయి. అనేక రంగాలలో, భారతదేశం గ్లోబల్ హబ్‌గా మారే మార్గంలో ఉంది”అని ప్రధాని మోడీ  అన్నారు.

ప్రపంచ పరిస్థితి అంత బాగా లేదన్నది వాస్తవం. అనేక పెద్ద ఆర్థిక వ్యవస్థలు కష్టాల్లో కూరుకుపోతున్నాయి. అనేక దేశాల్లో అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి:  ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ 
 

శతాబ్దానికి ఒకసారి వచ్చే ఈ మహమ్మారి దుష్ప్రభావాలు 100 రోజుల్లో పోలేవని అన్నారు. "కానీ ఈ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొన్నప్పటికీ, దీని ప్రభావం ప్రతిచోటా అనుభవించబడుతోంది. ఈ సమస్యల బారిన పడకుండా మన దేశాన్ని రక్షించడానికి భారతదేశం కొత్త కార్యక్రమాలను చెప‌డుతోంది" అని అన్నారు.  

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్