జీ20 చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారత జీ20 ప్రెసిడెన్సీ.. రెట్టింపైన ఫలితాలు.. వివరాలు ఇవే..

భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో జీ20 సదస్సు జరుగుతుంది. భారతదేశం జీ20 ప్రెసిడెన్సీ జీ20 చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా  నిలిచింది.

India G20 Presidency has been the MOST ambitious in history of G20 With 112 outcomes and presidency documents ksm

భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో జీ20 సదస్సు జరుగుతుంది. భారతదేశం జీ20 ప్రెసిడెన్సీ జీ20 చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా  నిలిచింది. భారతదేశం జీ20 ప్రెసిడెన్సీ ఎంతో విజయాన్ని సాధించింది. ప్రధాని మోదీ జీ20 సదస్సులో రెండో సెషన్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ.. న్యూఢిల్లీ G20 లీడర్స్ సమ్మిట్ డిక్లరేషన్‌ను ఆమోదించినట్లు ప్రకటించారు. దీనిపై ఏకాభిప్రాయం సాధించడంలో కృషి చేసినందుకు నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. 

‘‘నాకు శుభవార్త అందింది. మా బృందం కృషి కారణంగా.. న్యూఢిల్లీ జీ20 లీడర్స్ సమ్మిట్ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం కుదిరింది. ఈ నాయకత్వ ప్రకటనను ఆమోదించాలనేది నా ప్రతిపాదన. ఈ డిక్లరేషన్‌ను ఆమోదించినట్టుగా నేను ప్రకటిస్తున్నాను. ఈ సందర్భంగా నేను షెర్పా, మంత్రులు, దాని కోసం కష్టపడి పని చేసి, దానిని సాధ్యం చేసినవారికి అభినందనలు’’ అని ప్రపంచ నాయకుల నుంచి కరతాళధ్వనులు మధ్య మోదీ పేర్కొన్నారు. 

Latest Videos

జీ20 చరిత్రలో భారతదేశం జీ20 ప్రెసిడెన్సీ అత్యంత ప్రతిష్టాత్మకమైనదని మోదీ అన్నారు. ‘‘73 ఫలితాలు (లైన్స్ ఆఫ్ ఎఫర్ట్), 39 అనుబంధ పత్రాలు (వర్కింగ్ గ్రూప్ ఫలితాల పత్రాలతో సహా కాకుండా ప్రెసిడెన్సీ డాక్యుమెంట్‌లు ). మొత్తం 112 ఫలితాలు, ప్రెసిడెన్సీ డాక్యుమెంట్‌లతో మేము మునుపటి ప్రెసిడెన్సీల కంటే ముఖ్యమైన పనిని రెట్టింపు చేసాము’’ అని మోదీ అన్నారు. మునుపటి ప్రెసిడెన్సీలతో పోలిస్తే ఫలితాలు, అనుబంధ పత్రాలు.. 2x-5x పెరిగాయని చెప్పారు. 

vuukle one pixel image
click me!