Hello Moon: దక్షిణ ధ్రువంపై తొలి దేశంగా ఇండియా.. ఈ 14 రోజులపైనే అందరి చూపు

Published : Aug 23, 2023, 07:49 PM ISTUpdated : Aug 23, 2023, 07:59 PM IST
Hello Moon: దక్షిణ ధ్రువంపై తొలి దేశంగా ఇండియా.. ఈ 14 రోజులపైనే అందరి చూపు

సారాంశం

చంద్రయాన్ 2 వైఫల్యం నుంచి చంద్రయాన్ 3 గట్టెక్కించింది. చంద్రుడిపై తన జైత్రయాత్రకు అడ్డు లేదంటూ.. ఒక అడుగు వెనుకేసిన మరో అడుగు ముందుకే అనే రీతిలో ఇస్రో ఈ విజయాన్ని సొంతం చేసుకుంది. సుమారు 4 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి విక్రమ్ ల్యాండర్ సేఫ్‌గా ల్యాండ్ అయింది. ఇప్పుడు నిపుణుల దృష్టి అంతా తదుపరి 14 రోజులపైనే ఉన్నది. చంద్రయాన్ 3 మిషన్‌కు ఈ 14 రోజులే కీలకం.  

న్యూఢిల్లీ: 2008లో ప్రయోగంతో చంద్రయాన్ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. అది చిన్న కార్యమే అయినా.. ఘనంగా ఆత్మవిశ్వాసాన్ని నింపింది. కేవలం 25 నిమిషాలు మాత్రమే అక్కడ ఫ్లై చేసి నీరు ఉండే అవకాశం ఉన్నదని చెప్పిన అతిపెద్ద ఆవిష్కరణ. అనంతరం, ఆ ప్రోబ్‌ను ఉద్దేశపూర్వకంగా క్రాష్ చేయాల్సి వచ్చింది. ఈ విజయం తర్వాత 15 ఏళ్లకు ఇప్పుడు చంద్రయాన్ 3 మరో అద్భుత లక్ష్యాన్ని సాధించి పెట్టింది. చంద్రయాన్ 2 విఫలైమన నాలుగేళ్లకు అదే లక్ష్యాన్ని సగర్వంగా సాధించింది ఈ చంద్రయాన్ 3.

భూమ్యాకర్షణ శక్తిని ఉపయోగించుకుని సంక్లిష్ట ప్రయాణాన్ని విక్రమ్ చేపట్టింది. బుధవారం చివరి ఉద్విగ్న క్షణాలను దాటి, 5.45 గంటల నుంచి 25 కిలోమీటర్ల ఎత్తు నుంచి చంద్రుడి ఉపరితలంపై సేఫ్‌గా ల్యాండ్ అయింది. సరిగ్గా 6.03 నిమిషాలకు బెంగళూరులోని మిషన్ కంట్రోల్ కార్యాలయానికి విక్రమ్ ఒక సందేశాన్ని పంపింది. నేను చంద్రుడిపై కదం మోపాను అని చెప్పింది. అంతే ఇస్రో కార్యాలయంతోపాటు దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటిపోయాయి.

జులై 14వ తేదీ నుంచి సుమారు 40 రోజులపాటు చంద్రయాన్ 3 భూమి నుంచి ప్రయాణించి జాబిల్లిని చేరుకుంది. ఆగస్టు 5వ తేదీన చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించి 15 రోజుల తర్వాత అక్కడ దిగింది. ఈ కాలంలో మొత్తం 4 లక్షల కిలోమీటర్లను చుట్టేసింది.

చంద్రయాన్ 3 సాధించిన గొప్ప విషయం ఏమిటంటే.. భూమి ఎప్పుడూ చూడని చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ కావడం. ఈ ఏరియాలో స్పేస్ క్రాఫ్ట్‌ను ల్యాండ్ చేసిన ప్రపంచంలోనే తొట్టతొలి దేశంగా ఇండియా రికార్డ్ సృష్టించింది. ఈ ఏరియాలో వేలాది క్రేటర్లు, లోతైన లోయలు, ఎత్తైన శిఖరాల వంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ ల్యాండ్ కావడం పెద్ద సవాలే. దీన్ని చంద్రయాన్ 3 ఛేదించింది. రష్యా కూడా ఇక్కడి నుంచి 120 నుంచి 150 కిలోమీటర్ల దూరంలో దాని లూనా 25ను ల్యాండ్ చేయాలని అనుకుంది. కానీ, ఆ లూనా 25 విఫలమైంది. మొత్తంగా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా ఇండియా రికార్డుల్లోకి ఎక్కింది. ఒకప్పటి సోవియట్ యూనియన్, అమెరికా, చైనాలతో తర్వాత ఈ ఘనత భారత్ సాధించింది.

Also Read: కాలర్ ఎగరేసిన ఇస్రో .. చంద్రుడిపై పాదం మోపిన విక్రమ్, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారత్

ఇప్పుడు విక్రమ్ సేఫ్‌గా ల్యాండ్ అయింది. ఇప్పటి వరకు ఇది న్యూస్. కానీ, ఇప్పుడు నిపుణులంతా ఈ 14 రోజుల్లో ఆవిష్కరించే, విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్‌లు వెల్లడించే అనూహ్య, అద్భుత విషయాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ 14 రోజులు మాత్రమే విక్రమ్ ల్యాండ్ అయిన ఏరియా సూర్యుడి కిరణాలతో ప్రకాశవంతంగా ఉంటుంది. ఆ తర్వాత ఈ ప్రాంతం మళ్లీ అంధకారంగా మారిపోతుంది. అందుకే ఈ మిషన్ లైఫ్ టైమ్ 14 రోజులు మాత్రమే. ఈ 14 రోజులు చంద్రుడికి ఒక రోజే. చంద్రుడి ఆ ఒక్క రోజు కాలమే భూమికి 14 రోజులు. ఈ 14 రోజులు గడిచిన తర్వాత అక్కడ మన ల్యాండర్, రోవర్‌లు కాలం చెల్లినవిగా మిగిలిపోతాయి.

ఈ రెండు రోబోట్లు ఇప్పుడు మూన్ జియాలజీ, దాని నీటి వనరులను, భవిష్యత్‌లో మానవుల అన్వేషణలకు ఆ నీటి  వనరు ఉపకరించే శక్తిని కలిగి ఉన్నదా? వంటి సమాచారమే కాదు.. భవిష్యత్‌లో చంద్రుడిపై జరిపే ప్రయోగాలు, అన్వేషణలకు అవసరమైన సమాచారాన్ని కూడా ఈ మిషన్ పంపిస్తుంది. 

ఈ మిషన్ ద్వారా సాధించే సమాచారం కేవలం మన దేశానికే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష సంస్థలకు ఉపయుక్తమవుతుంది. ఇప్పుడిప్పుడే మళ్లీ మూన్ రేస్ ప్రారంభమైన సంగతి విధితమే.

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?