Chandrayaan 3:  యావత్ భారతావనికి ఎంతో గర్వకారణం : ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్

Published : Aug 23, 2023, 07:12 PM ISTUpdated : Aug 23, 2023, 09:28 PM IST
Chandrayaan 3:  యావత్ భారతావనికి ఎంతో గర్వకారణం : ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్

సారాంశం

Chandrayaan 3: చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్‌ మాట్లాడుతూ.. ఈ విజయం యావత్ భారతావనికి ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.  

Chandrayaan 3: 140 కోట్ల భారతావని ఆశలను తనతో పాటు మోసుకెళ్లిన చంద్రయాన్-3 చంద్రుడిపై అడుగుపెట్టింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ల్యాండర్ విక్రమ్ విజయవంతంగా సాప్ట్ ల్యాండింగ్ అయ్యింది. భారతీయ కాలమానం ప్రకారం.. బుధవారం సాయంత్రం 5:44 గంటలకు చంద్రయాన్-3లోని ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడిపై అడుగుపెట్టింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ముద్దాడింది.ఈ అద్భుత ఘట్టాన్ని ప్రత్యేకంగా చూసేందుకు వీలుగా ల్యాండింగ్ ప్రక్రియనంతా ఇస్రో ప్రత్యక్ష ప్రసారం చేసింది. 

గత నెల 14న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన చంద్రయాన్-3.. 41 రోజుల సుధీర్ఘ ప్రయాణం అనంతరం చంద్రుడి దక్షిణ ధ్రువంపై సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. చంద్రుడిపై అడుగు పెట్టిన నాలుగో దేశంగా భారత్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ విజయంలో భారత తన కీర్తి పతాకం చంద్రుడిపై సగర్వంగా ఎగిరింది. ఈ తరుణంలో ఇస్రో శాస్త్రవేత్తల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.ఈ అపూర్వ విజయం అనంతరం దేశవ్యాప్తంగా సంబురాలు ప్రారంభమయ్యాయి.

ఈ తరుణంలో ఇస్రో చీఫ్‌ ఎస్‌.సోమ్‌నాథ్‌ మాట్లాడుతూ.. చంద్రుడిపై మనం అడుగు పెట్టామన్నారు. చంద్రుడిపై ‘సాఫ్ట్ ల్యాండింగ్’లో విజయం సాధించాం, చంద్రుడిపై భారత్ ఉంది. నిజానికి దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి దేశంగా భారత్ అవతరించిందని పేర్కొన్నారు. మిషన్ విజయవంతం కావడం వెనుక శాస్త్రవేత్తల బృందం కృషిని ప్రశంసిస్తూ, "ఈ మిషన్ వెనుక ఉన్న వ్యక్తులకు  ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని సోమనాథ్ అన్నారు.

ఈ తరుణంలో ఇస్రో చీఫ్‌ ఎస్‌.సోమ్‌నాథ్‌ మాట్లాడుతూ.. "చంద్రుడిపై మనం అడుగు పెట్టామన్నారు. చంద్రుడిపై ‘సాఫ్ట్ ల్యాండింగ్’లో విజయం సాధించాం, చంద్రుడిపై భారత్ ఉంది. నిజానికి దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి దేశంగా భారత్ అవతరించింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై తన వాహనాన్ని ల్యాండ్ చేసిన ప్రపంచంలోనే తొలి దేశంగా భారత్ అవతరించింది. వచ్చే 14 రోజులు ఎంతో ఆసక్తికరం. ప్రతి భారతీయుడు చంద్రయాన్ 3 విజయం కోసం ప్రార్థించారు.'అని ప్రకటించారు. 

ఆయన ఇంకా మాట్లాడుతూ.. వచ్చే నెలలో ఆదిత్య ఎల్ 1 ను లాంచ్ చేస్తున్నాం. ఈ ప్రయోగంతో సూర్యుడి గురించి తెలుసుకోవచ్చు. అలాగే.. గగన్ యాన్ అబర్ట్ మిషన్ కూడా అక్టోబర్ మొదటి వారంలోపు చేస్తాం.'అని ప్రకటించారు.  

'చంద్రుని దక్షిణ ధ్రువంపై తన వాహనాన్ని ల్యాండ్ చేసిన ప్రపంచంలోనే తొలి దేశంగా భారత్ అవతరించింది' అని ఇస్రో ప్రకటించింది. భారతదేశానికి ముందు అమెరికా, చైనా, సోవియట్ యూనియన్ మాత్రమే చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి. 

చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్‌, శాస్త్రవేత్తలందర్ని అభినందించారు.   ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. ‘మన కళ్ల ముందు చరిత్ర సృష్టించడం చూస్తే జీవితం ధన్యమవుతుంది. ఈ క్షణాలు మరిచిపోలేనివి. ఈ క్షణాలు అసాధారణమైనవి. ఈ క్షణం అభివృద్ధి చెందిన భారతదేశం శక్తి. నవ భారతం కోసం నినాదాలు చేయాల్సిన తరుణం ఇది. కష్టాల సాగరాన్ని దాటాల్సిన తరుణం ఇది. విజయపథంలో నడవాల్సిన తరుణం ఇది. ఈ క్షణం 140 కోట్ల భారతీయుల శక్తితో కూడుకున్నది. ఇది భారతదేశంలో కొత్త శక్తి, కొత్త విశ్వాసం, కొత్త చైతన్యం సంతరించుకున్న క్షణం. భారతదేశ ఎదుగుదల ప్రపంచానికి తెలియజేసే తరుణం ఇది. అమరత్వపు తొలి వెలుగులో విజయపు మకరందం కురిసింది.అని పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి ఇంకా మాట్లాడుతూ.. 'కొత్త చరిత్ర సృష్టిస్తున్నందున, ప్రతి భారతీయుడు వేడుకలలో మునిగిపోయాడు. ఈ మిషన్ కోసం సంవత్సరాలుగా కృషి చేసిన చంద్రయాన్ బృందాన్ని, ఇస్రో, దేశంలోని శాస్త్రవేత్తలందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..