
India World Press Freedom Index: భారత్ లో పత్రికాస్వేచ్ఛలో నానాటికీ పడిపోతోందని, మీడియా పై ఆంక్షలు ఎక్కువయ్యాయని రిపోర్టర్స్ విత్ ఔట్ బార్డర్స్ సంస్థ స్పష్టం చేసింది. తాజాగా ప్రకటించిన నివేదిక ప్రకారం.. భారత్ గతేడాది 142వ స్థానంలో ఉండగా.. ఈ ఏడాది 150వ ర్యాంక్‌కు దిగజారింది. ప్రతి దేశంలోనూ పాత్రికేయులు, వార్తా సంస్థలు, నెటిజన్‌ల స్వేచ్ఛ ఆంక్షలున్నట్టు తెలిపింది. అలాంటి స్వేచ్ఛను గౌరవించే ప్రభుత్వ ప్రయత్నాలను వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ హైలైట్ చేస్తుంది. అలాగే.. జర్నలిస్టులపై జరుగుతున్న హింస, రాజకీయంగా పక్షపాత మీడియా, కేంద్రీకృత మీడియా యాజమాన్యం ఇవన్నీ భారత దేశంలో పత్రికా స్వేచ్ఛకు ముప్పుగా పరిణమించాయని నివేదిక పేర్కొంది.
గ్లోబల్ మీడియా వాచ్‌డాగ్ మంగళవారం విడుదల చేసిన నివేదిక కూడా ఈ సమాచారమే అందించబడింది. నేపాల్ మినహా.. భారతదేశం యొక్క ఇతర పొరుగు దేశాలు కూడా ప్రెస్ ఫ్రీడమ్ ర్యాంకింగ్స్‌లో క్షీణించాయని పేర్కొంది. పాకిస్తాన్ 157, శ్రీలంక 146, బంగ్లాదేశ్ 162, మయన్మార్ 176 వ స్థానంలో ఉన్నాయని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ విడుదల చేసిన నివేదిక తెలిపింది. ఈ నివేదిక మొత్తం 180 దేశాలకు సంబంధించినది.
RSF 2022 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ప్రకారం.. నేపాల్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 76వ స్థానానికి చేరుకుంది. గతేడాది 106వ ర్యాంక్ లో ఉంది. ఈ సంవత్సరం నార్వే (1వ) డెన్మార్క్ (2వ), స్వీడన్ (3వ), ఎస్టోనియా (4వ), ఫిన్లాండ్ (5వ) స్థానాల్లో ఉండగా, 180 దేశాల్లో ఉత్తర కొరియా అట్టడుగున నిలిచింది. నివేదికలో రష్యా గతేడాది 150వ స్థానంలో ఉండగా..ఈ ఏడాది 155వ ర్యాంక్‌లో నిలిచింది. చైనా రెండు స్థానాలు ఎగబాకి 175వ స్థానానికి చేరుకుంది. గతేడాది చైనా 177వ స్థానంలో ఉంది.
"వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే సందర్భంగా, రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్, మరో తొమ్మిది మానవ హక్కుల సంస్థలు తమ పని కోసం జర్నలిస్టులను, ఆన్‌లైన్ విమర్శకులను లక్ష్యంగా చేసుకోవడం మానేయాలని భారత అధికారులను కోరుతున్నాయని ఓ వెబ్‌సైట్‌లో తన ప్రకటనలో తెలిపింది. మరి ముఖ్యంగా ఉగ్రవాదం, దేశద్రోహ చట్టాల కింద జర్నలిస్టులపై విచారణను నిలిపివేయాలని ప్రకటన పేర్కొంది.
వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌పై స్పందిస్తూ, మూడు భారతీయ జర్నలిస్టు సంస్థలు సంయుక్త ప్రకటనలో "ఉద్యోగ అభద్రత పెరిగింది, అయితే పత్రికా స్వేచ్ఛపై దాడులు బాగా పెరిగాయి." ఈ విషయంలో భారత్ ర్యాంకింగ్స్‌లో అంతగా రాణించలేదని తెలిపాయి.
ఈ రిపోర్టు పై భారతీయ మహిళా ప్రెస్ క్లబ్, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ప్రెస్ అసోసియేషన్ ఇలా పేర్కొన్నాయి, జర్నలిస్టులు చిన్న చిన్న కారణాలతో కఠినమైన చట్టాల కింద జైలు పాలయ్యారు. కొన్ని సందర్భాల్లో సామాజిక మాధ్యమాలలో స్వీయ-నియమించిన చట్టం సంరక్షకుల నుండి వారి ప్రాణాలకు బెదిరింపులను ఎదుర్కొన్నారని తెలిపింది.