భారత్ లో రోజురోజుకి పెరుగుతున్న కొవిడ్ కేసులు..ఒక్కరోజే నలుగురి మృతి

Published : Jun 03, 2025, 05:59 AM IST
భారత్ లో రోజురోజుకి పెరుగుతున్న కొవిడ్ కేసులు..ఒక్కరోజే నలుగురి మృతి

సారాంశం

భారత్‌లో కొవిడ్ కేసులు రోజురోజుకి భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సోమవారం ఒక్కరోజే 22 ఏళ్ల యువతి, 25 ఏళ్ల యువకుడుతో సహా నలుగురు మరణించారు.

 ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. హాంకాంగ్, సింగపూర్, చైనా వంటి దేశాల్లో కొవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. భారత్‌లో కూడా కొవిడ్ కేసులు రోజురోజుకి విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్‌లో కొవిడ్ కేసులు 4000 దాటాయి. ఈ నేపథ్యంలో ఒక్క రోజులోనే నలుగురు మరణించారు. వీరిలో 22 ఏళ్ల యువతి, 25 ఏళ్ల యువకుడు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

సోమవారం  రాత్రి 8 గంటల వరకు వచ్చిన కొవిడ్ నివేదిక ప్రకారం భారత్‌లో 3,961 కొత్త కేసులు నమోదయ్యాయి. కేరళలో అత్యధికంగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కేరళలో 1,435 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర,ఢిల్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

అత్యధిక కొవిడ్ కేసులు నమోదైన టాప్ 5 రాష్ట్రాలు

కేరళ: 1435

మహారాష్ట్ర: 506

ఢిల్లీ: 483

పశ్చిమ బెంగాల్: 331

కర్ణాటక: 300

ఒక్క రోజులో నాలుగు మరణాలు

జూన్ 2న భారత్‌లో కొవిడ్ కేసులు 4000 దాటాయి. సోమవారం ఒక్క రోజే నలుగురు మరణించారు. ఢిల్లీ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలలో ఒక్కొక్కరు మరణించారు. వీరిలో ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల యువతి కూడా ఉంది. ఆమెకు ఊపిరితిత్తుల సమస్య ఉంది. కొవిడ్ సోకిన తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించింది. తమిళనాడుకు చెందిన 25 ఏళ్ల యువకుడికి ఆస్తమా ఉంది. అతనికి కూడా కొవిడ్ సోకిన తర్వాత ఆరోగ్యం క్షీణించి మరణించాడు.

కర్ణాటకలో 300 దాటిన కొవిడ్ కేసులు

కర్ణాటకలో కొవిడ్ కేసులు 300 దాటాయి. ఈ రోజు కొత్త కేసులు గణనీయంగా పెరిగాయి. గత 24 గంటల్లో 87 కొత్త కేసులు నమోదయ్యాయి. 29 మంది కోలుకున్నారు. 504 మందికి కొవిడ్ పరీక్షలు చేశారు. కర్ణాటకలో సోమవారం  పాజిటివిటీ రేటు 17.2 శాతం.

రాష్ట్రంలో నాలుగు మరణాలు

కర్ణాటకలో ఈ కొత్త కొవిడ్ వేవ్‌లో నలుగురు మరణించారు. వీరిలో ముగ్గురు వ్యాక్సిన్ తీసుకున్నారు. కర్ణాటకలో మరణించిన నలుగురు 60 ఏళ్లు పైబడిన వారే.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !