ఒక్క రోజులోనే ఇండియాలో రికార్డు కరోనా కేసులు: మొత్తం కేసులు 1,31,868కి చేరిక

By narsimha lode  |  First Published May 24, 2020, 10:18 AM IST

 దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పెరుగుతున్న కేసుల తీవ్రతపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రోజులోనే 6767 కేసులు నమోదయ్యాయి. 


న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పెరుగుతున్న కేసుల తీవ్రతపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రోజులోనే 6767 కేసులు నమోదయ్యాయి. దీంతో  దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,31,868కి చేరుకొన్నాయి. ఇందులో 73,560 కేసులు యాక్టివ్ కేసులుగా ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కేసుల రివకరీ రేటు 42.28గా ఉందని కేంద్రం తెలిపింది. 

also read:భారత్ లో ఆగని కరోనా విలయతాండవం... మరో 6వేలకు పైగా కేసులు

Latest Videos

ఇప్పటివరకు 54,440 మంది కరోనా నుండి కోలుకొన్నారు. కరోనా సోకి సుమారు 3,867 మంది మృతి చెందినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.శుక్ర, శనివారాల్లో 1,15,364 మంది నుండి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపితే 6,767 మందికి కరోనా సోకినట్టుగా తేలిందని కేంద్రం తెలిపింది. ఈ ఏడాది మే 23 వరకు దేశంలో 28,34,798 మంది శాంపిల్స్ పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ తెలిపింది.

దేశంలోని రెండో స్థాయి మున్సిపల్ ఏరియాల నుండే కరోనా పెద్ద ఎత్తున కరోనా సోకుతోందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్  రాష్ట్రాల్లోని రెండో స్థాయి మున్సిపాలిటీల్లో ఎక్కువ కరోనా కేసులు నమోదు అవుతున్నట్టుగా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నత అధికారులు ప్రకటించారు.
 

click me!