"మిత్రురాలి" ఇంట్లో సీనియర్ బీజేపీ నేత, కాలింగ్ బెల్ మోగడంతో బాల్కనీ నుంచి జంప్

Published : May 23, 2020, 02:40 PM IST
"మిత్రురాలి" ఇంట్లో సీనియర్ బీజేపీ నేత,  కాలింగ్ బెల్ మోగడంతో బాల్కనీ నుంచి జంప్

సారాంశం

ఒక సీనియర్ బీజేపీ నేత తన "మిత్రురాలిని" కలవడానికి వెళ్ళాడు. ఆయన ఇంట్లో ఉండగా బయటనుండి ఎవరో తలుపు తట్టడంతో రెండవ ఫ్లోర్ బాల్కనీ నుంచి చీరతో దిగే ప్రయత్నం చేయబోయి కింద పడి కాలు విరగ్గొట్టుకున్నాడు. 

కరోనా వైరస్ దెబ్బకు దేశమంతా లాక్ డౌన్ విధించడం వల్ల అందరూ ఇండ్లలోనే ఉండేసరికి అక్రమ సంబంధాలను నెరుపుతున్నవారికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి కాబోలు, లాక్ డౌన్ ను సడలిస్తున్నట్టు ఇలా ప్రకటించగానే... అలా వారి తెర చాటు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 

తాజాగా ఒక సీనియర్ బీజేపీ నేత కూడా (ఉండబట్టుకోలేకపోయాడో ఏమో పాపం) తన "మిత్రురాలిని" కలవడానికి వెళ్ళాడు. ఆయన ఇంట్లో ఉండగా బయటనుండి ఎవరో తలుపు తట్టడంతో రెండవ ఫ్లోర్ బాల్కనీ నుంచి చీరతో దిగే ప్రయత్నం చేయబోయి కింద పడి కాలు విరగ్గొట్టుకున్నాడు. 

హర్యానా బీజేపీకి చెందిన సీనియర్ నేత చంద్రప్రకాష్ కతూరియా, చండీగఢ్ లోని సెక్టార్ 63లో నివసిస్తున్న తన మిత్రురాలిని కలవడానికి వెళ్ళాడు. ఆయన ఇంట్లో తన మిత్రురాలితో ఉండగా బయటనుండి ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. 

ఎవరో తలుపు తట్టడంతో ఆయన వెనుకవైపు ఉండే బాల్కనీ నుంచి చీర ద్వారా కిందకు దిగే ప్రయత్నం చేసాడు. అలా ప్రయత్నం చేస్తుండగా రెండవ ఫ్లోర్ నుంచి జారీ పడ్డాడు. కింద పడి లేవలేకుండా ఉన్న అతడిని స్థానికులు తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు. 

ఆయన ఆ ఇంటికి ఎందుకు వెళ్లారు, ఎవరు ఆ మిత్రురాలు, ఎవరో తలుపు తట్టగానే ఎందుకు అలా భయంతో బాల్కనీ నుంచి దూకవలిసి వచ్చిందనే విషయాలు విచారణలో ఉన్నాయి. 

ఈ విషయం సోషల్ మీడియాలో పొక్కగానే హర్యానా రాష్ట్రమంతా ఇది సంచలనంగా మారింది. ప్రతిపక్షాలు అధికార బీజేపీపై విరుచుకుపడుతున్నాయి. సోషల్ మీడియాలో అయితే... ఇందుకు సంబంధించిన జోకులకు అంతే లేదు. 

ఒకరేమో ఒలింపిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అంటే, మరొకరేమో సోషల్ డిస్టెంసింగ్ పాటించడం కోసం ఇలా బాల్కనీ నుంచి దిగాడు అంటూ చురకలు వేస్తున్నారు. మొత్తానికి ఆయన చేసిన ర్యాంకు పని మాత్రం బయటకు పొక్కడంతో ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక్కడొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... వచ్చిన ఆ సదరు నాయకుడు లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూ మూతికి, ముక్కుకు రుమాలు చుట్టుకున్నాడు. వెళ్ళేది ఎక్కడికైనా, చేసేది ఏపనైనా నియమాలను మాత్రం సదరు నేత గారు పాటిస్తున్నట్టున్నారు. 

PREV
click me!

Recommended Stories

Jallikattu : రక్తచరిత్ర కాదు.. ఇది రక్తం మరిగే ఆట.. జల్లికట్టు గురించి తెలిస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ !
Ukrainian Woman Lidia Lakshmi Slams YouTuber Anvesh Over Comments Hindu Gods | Asianet News Telugu