రోహిణి కోర్టు జడ్జికి కరోనా: ఇండియాలో మొత్తం కేసులు 2,07,611కి చేరిక

By narsimha lode  |  First Published Jun 3, 2020, 10:33 AM IST

దేశంలో  గత 24 గంటల్లో 8,909 కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం కేసుల  సంఖ్య 2,07,615కి చేరుకొన్నాయి.దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,00,303 ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం నాడు ప్రకటించింది. 


న్యూఢిల్లీ:దేశంలో  గత 24 గంటల్లో 8,909 కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం కేసుల  సంఖ్య 2,07,615కి చేరుకొన్నాయి.దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,00,303 ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం నాడు ప్రకటించింది. కరోనాతో  దేశంలో 5815 మంది మృతి చెందారు.  గత 24 గంటల్లో 217 మంది మరణించినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

కరోనా సోకిన రోగుల్లో 48.19 శాతం కోలుకొంటున్నట్టుగా కేంద్రం  తెలిపింది. మంగళవారం నాటికి దేశంలో  కరోనా కేసులు రెండు లక్షలను దాటాయి. పక్షం రోజుల వ్యవధిలోనే లక్ష కరోనా కేసులు దేశంలో నమోదయ్యాయి. 

Latest Videos

జార్ఖండ్ రాష్ట్రంలో 712 కేసులు నమోదయ్యాయి. వీటిలో 387 యాక్టివ్ కేసులున్నాయి. 320 మంది ఈ వైరస్ నుండి కోలుకొన్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు ఐదుగురు మరణించారు.

also read:భారత్ లో కరోనా అల్ టైం రికార్డు: వరుసగా రెండో రోజు కూడా 8వేలు దాటిన కేసులు

రోహిణి కోర్టు జడ్జికి కరోనా వైరస్ సోకింది. ఆయన భార్యకు ఇంతకు ముందే కరోనా సోకింది. దీంతో జడ్జి సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లాడు. బీహార్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 177 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 4096 కరోనా కేసులు చేరుకొన్నాయి. 24 గంటల్లో ఇద్దరు కరోనాతో మరణించారు. ఈ వైరస్ తో మరణించిన వారి సంఖ్య రాష్ట్రంలో 24కి చేరుకొంది.

click me!