సీఎం ఇంటికి, సచివాలయానికి బాంబు బెదిరింపులు

Published : Jun 03, 2020, 09:02 AM ISTUpdated : Jun 03, 2020, 09:26 AM IST
సీఎం ఇంటికి, సచివాలయానికి బాంబు బెదిరింపులు

సారాంశం

ఈ బెదిరింపుతో భద్రతను పెంచారు. చెన్నై గ్రీవెన్స్‌ రోడ్డులో సీఎం పళనిస్వామి నివాసం, మెరీనా తీరంలోని కామరాజర్‌ సాలైలో సచివాలయం ఉన్న విషయం తెలిసిందే. ఈ పరిసరాలు భద్రతా వలయంలోనే ఉంటాయి. 

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఇంటికి, సచివాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. కాగా.. ఈ బెదిరింపు ఫోన్ కాల్ తో అధికారులు అప్రమత్తమయ్యారు. సదరు నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసలు చెప్పారు.

ఈ బెదిరింపుతో భద్రతను పెంచారు. చెన్నై గ్రీవెన్స్‌ రోడ్డులో సీఎం పళనిస్వామి నివాసం, మెరీనా తీరంలోని కామరాజర్‌ సాలైలో సచివాలయం ఉన్న విషయం తెలిసిందే. ఈ పరిసరాలు భద్రతా వలయంలోనే ఉంటాయి. ఈ పరిస్థితుల్లో తరచూ సీఎం ఇంటికి, సచివాలయానికి బాంబు బెదిరింపులు రావడం పరిపాటిగా మారింది.

మంగళవారం వచ్చిన బెదిరింపు కాల్స్‌తో పోలీసులు అప్రమత్తమయ్యారు. సచివాలయం పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. బాంబ్, డాగ్‌స్వ్కాడ్‌లు రంగంలోకి దిగాయి. సచివాలయంలోని అన్ని మార్గాల్ని తమ ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. సీఎం ఇంటి పరిసరాల్లోనూ భద్రతను పెంచారు. ప్రవేశ మార్గంలో మెటల్‌ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. ఈ బెదిరింపు ఇచ్చిన యువకుడి కోసం సైబర్‌ క్రైం గాలింపు చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu