ఒకే రోజు రికార్డు స్థాయిలో కేసులు: మొత్తం కరోనా కేసులు 2,86,579కి చేరిక

By narsimha lodeFirst Published Jun 11, 2020, 10:18 AM IST
Highlights

దేశంలో కరోనా కేసుల సంఖ్య గత 15 రోజుల నుండి  ఐదు వేల కంటే ఎక్కువ సంఖ్యలో నమోదౌతున్నాయి. గురువారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య2,86,579 కి చేరుకొన్నాయి.


న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య గత 15 రోజుల నుండి  ఐదు వేల కంటే ఎక్కువ సంఖ్యలో నమోదౌతున్నాయి. గురువారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య2,86,579 కి చేరుకొన్నాయి.

బుధవారం నాడు దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,76,583 కేసులు ఉండేవి. గత 24 గంటల్లో దేశంలో 9996 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు కరోనాతో 8,102 మంది మరణించారు.

మహారాష్ట్రలో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఇక్కడ 90వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు రాష్ట్రం నిలిచింది.తమిళనాడులో 35 వేల కేసులు నమోదైనట్టుగా కేంద్రం ప్రకటించింది.మహారాష్ట్రలో అత్యధిక కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడ అధికంగానే ఉంది. ఆ తర్వాతి స్థానాలను గు.జరాత్, ఢిల్లీ రాష్ట్రాలు నిలిచాయి.

యాక్టివ్ కేసులను దాటిన రోగుల రికవరీ: కరోనా కేసుల్లో ఐదో స్థానానికి చేరిన ఇండియా

ఢిల్లీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య పెరగడంతో పంజాబీబాగ్ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించాలని  సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ స్టాండింగ్ కమిటి చైర్మెన్ భూపేందర్ గుప్తా చెప్పారు.

ఇండోర్‌లో 41 మందికి కరోనా సోకింది.దీంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,9222కి చేరుకొన్నాయి. 163 మంది మరణించారు.

దేశంలో ఇప్పటివరకు 9996 కేసులు ఇప్పటివరకు నమోదు కాలేదు. ఇవే అత్యధిక కేసులు. రోజు రోజుకు కరోనా కేసులు పెరగడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 

click me!