తల్లిదండ్రులకు మత్తు ఇచ్చి.. ప్రియుడితో కలిసి ఇంట్లోనే..

Published : May 31, 2021, 09:40 AM IST
తల్లిదండ్రులకు మత్తు ఇచ్చి.. ప్రియుడితో కలిసి ఇంట్లోనే..

సారాంశం

ఇంట్లోని లాకర్ పగలకొట్టి.. నగలు, డబ్బు కాజేసినట్లు గుర్తించారు. అయితే.. ఇంట్లోకి ఎవరూ కొత్తగా వచ్చినట్లు ఆనవాళ్లు కనిపించకపోవడంతో.. ఇంటి దొంగ పనిగా గుర్తించారు.


కన్న తల్లిదండ్రులను ఓ యువతి దారుణంగా మోసం చేసింది. తన ఇంటికే తాను కన్నం వేసింది. తల్లిదండ్రులను మత్తులోకి దించి.. ప్రియుడితో కలిసి చోరీకి పాల్పడింది. దాదాపు రూ.13లక్షల విలువైన నగదు, రూ.3లక్షల విలువైన బంగారు ఆభరణాలు దోచుకెళ్లడం గమనార్హం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూణే నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మనోజ్ ఇంట్లో ఇటీవల దొంగతనం జరిగింది. దీంతో.. అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంట్లోని లాకర్ పగలకొట్టి.. నగలు, డబ్బు కాజేసినట్లు గుర్తించారు. అయితే.. ఇంట్లోకి ఎవరూ కొత్తగా వచ్చినట్లు ఆనవాళ్లు కనిపించకపోవడంతో.. ఇంటి దొంగ పనిగా గుర్తించారు.

దీంతో పోలీసులు దర్యాప్తుని ఇంట్లో వాళ్లతో మొదలు పెట్టారు. ఈ క్రమంలో మనోజ్‌ కుమార్తె చెప్పిన సమాధానాలు పొంతన లేకపోవడంతో ఆమెపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమెను గట్టిగా విచారించగా నేరాన్ని అంగీకరించింది. తాను, ప్రియుడు విన‌య్ యాద‌వ్‌,  స‌హాయ‌కుడు శుభం యాద‌వ్‌తో కలిసి ఈ చోరి చేసినట్లు తెలపడంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. కాగా మ‌రో నిందితుడు రంజిత్ యాద‌వ్ ఇంకా ప‌రారీలో ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. దొంగతనం జరిగిన రోజు రాత్రి ఖుష్బు తేనీరులో నిద్ర‌మాత్ర‌లిచ్చి కుటుంబ సభ్యులను మ‌త్తులోకి జారుకునేలా చేసింది. అనంత‌రం ప్రియుడు, అత‌డి స్నేహితుల‌ను ఇంట్లోకి రానిచ్చి చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దొంగలించిన సొమ్ము మొత్తం రిక‌వ‌రీ చేసిన‌ట్లు చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu