ఇండియాకు వస్తున్న ఫ్లైట్ పాకిస్తాన్‌కు డైవర్ట్.. ఎందుకు? ఆ తర్వాత ఏం జరిగింది?

By Mahesh K  |  First Published Oct 15, 2023, 9:57 PM IST

దుబాయ్ నుంచి అమృత్‌సర్‌కు వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ శనివారం సడన్‌గా పాకిస్తాన్‌లోని కరాచీకి డైవర్ట్ చేయాల్సి వచ్చింది. కరాచీ ఎయిర్‌పోర్టులో రెండు గంటల పాటు గడిపిన తర్వాత తిరిగి అమృత్‌సర్‌కు ఆ ఫ్లైట్ బయల్దేరింది. 
 


న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 14 వ తేదీన ఉదయం 8.51 గంటలకు (స్థానిక కాలమానం) దుబాయ్ నుంచి ఇండియాకు బయల్దేరింది. ఆ ఫ్లైట్ అమృత్‌సర్‌కు రావాల్సి ఉన్నది. కానీ, దాన్ని అకాస్మాత్తుగా పాకిస్తాన్‌లోని కరాచీకి డైవర్ట్ చేశారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కరాచీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన ఆ ఫ్లైట్ రెండు గంటల తర్వాత తిరిగి అమృత్‌సర్‌కు బయల్దేరింది. అసలేం జరిగిందంటే?

దుబాయ్ నుంచి బయల్దేరిన కొన్ని గంటల తర్వాత ఆ ఫ్లైట్‌లోని ఓ ప్రయాణికుడికి అనారోగ్య సమస్య వచ్చింది. వెంటనే వైద్య సేవలు అందించాల్సిన అవసరం వచ్చింది. దీంతో ఫ్లైట్ సిబ్బంది సమీపంలోని ఎయిర్‌పోర్టును పరిశీలించగా.. సమీపంగా కరాచీ ఎయిర్‌పోర్టును గుర్తించింది. వెంటనే ఫ్లైట్‌ను కరాచీకి డైవర్ చేసింది.

Latest Videos

undefined

Also Read: ‘హమాస్‌కు ఎలాంటి గతి పడుతున్నదో చూడండి’.. లెబనాన్ నుంచి దాడి చేస్తున్న హెజ్బోల్లాకు ఇజ్రాయెల్ వార్నింగ్

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి మాట్లాడుతూ.. దుబాయ్ నుంచి అమృత్‌సర్‌కు వస్తున్న విమానంలో ఓ పేషెంట్‌కు అత్యవసర వైద్య సేవలు అవసరం వచ్చాయని, వెంటనే ఆ సమయంలో సమీపంలోని కరాచీ ఎయిర్‌పోర్టుకు విమానాన్ని తరలించారని వివరించారు. తాము ఆ ఎయిర్‌పోర్టు అధికారులతో సమన్వయంలోకి వెళ్లామని, తమ ప్రయాణికుడికి వెంటనే వైద్య సేవలు అందించామని తెలిపారు. కరాచీ ఎయిర్‌పోర్టులోని వైద్యుడు ఆ ప్రయాణికుడికి చికిత్స అందించాడని, ఆ ప్రయాణికుడు మళ్లీ తన విమాన ప్రయాణాన్ని కొనసాగించడానికి సిద్ధంగానే ఉన్నాడనే నిర్ధారణకు వచ్చిన తర్వాత ఫ్లైట్ అమృత్‌సర్‌కు బయల్దేరిందని వివరించారు.

click me!