కారణమిదీ: విడ్లీ ఓటీటీ టీవీ బ్యాన్ చేసిన ఇండియా

Published : Dec 12, 2022, 07:04 PM ISTUpdated : Dec 12, 2022, 07:24 PM IST
 కారణమిదీ: విడ్లీ ఓటీటీ టీవీ బ్యాన్ చేసిన ఇండియా

సారాంశం

ఇండియాకు వ్యతిరేకంగా  ప్రసారాలు చేస్తున్న విడ్లీ ఓటీటీ టీవీని  కేంద్ర ప్రభుత్వం  బ్యాన్ చేసింది.    

న్యూఢిల్లీ:పాకిస్తాన్ కు బేస్డ్   విడ్లీ  ఓటీటీ టీవీని కేంద్ర ప్రభుత్వం  బ్లాక్ చేసింది.  ఇటీవల ఈ ఓటీటీ లో  సేవక్ పేరుతో  వెబ్ సీరీస్ ను  ప్రసారం చేసింది.ఈ వెబ్ సీరీస్ జాతీయ భద్రతకు  హానికరమనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.ఈ వెబ్ సీరీస్ కు చెందిన మూడు  ఎపిసోడ్ లు ఇప్పటికే  ప్రసారమయ్యాయి.ఈ వెబ్ సీరీస్  పాకిస్తాన్ స్పాన్సర్ చేసిందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.ఈ ఏడాది  నవంబర్  26వ తేదీన తొలి ఎపిసోడ్ ప్రసారమైంది.

భారతదేశానికి సంబంధించిన సున్నితమైన చారిత్రక సంఘటనలను వెబ్ సిరీస్ లో  వక్రీకరించారు.  భారత్ కు వ్యతిరేకంగా ఈ వెబ్ సీరీస్ లో ప్రసారమయ్యాయి. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ద్వేషాన్ని కలిగించేలా  ఈ ప్రసారాలున్నాయి.ఆపరేషన్ బ్లూస్టార్ తర్వాత  ఓ వర్గాన్ని కించపర్చేలా డైలాగ్ లున్నాయి.వెబ్ సిరిస్ భారతీయ కమ్యూనిటీల మధ్య ద్వేషం విభజన లక్ష్యంగా కన్పించిందని సమాచార శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఈ వెబ్ సీరీస్ లో ప్రసారం చేసిన  దృశ్యాల్లో ఆశోక్ చక్రం మంటల్లో ఉన్నట్టుగా చూపారు. దేశంలో ప్రజల మధ్య విధ్వేషాలు  కలిగేంచేలా  ఈ వెబ్ సీరీస్ ప్రసారాలున్నాయని  అధికారులు చెబుతున్నారు.  అంతేకాదు  గతంలో దేశంలో జరిగిన ఘటనలను  ప్రజల మధ్య  చిచ్చు పెట్టేలా చూపే ప్రయత్నం చేశారని  అధికారులు గుర్తు చేస్తున్నారు.ఈ వెబ్ సీరీస్ లో  ప్రసారమైన దృశ్యాలు, డైలాగ్ లను అధికారులు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు  కేంద్ర ప్రభుత్వంపై  ప్రజలను రెచ్చగొట్టేలా  కూడ వెబ్ సీరీస్  ప్రసారాలున్న విషయాన్ని సమాచార శాఖ అధికారులు గుర్తు  చేస్తున్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని వీడ్లీ ఓటీటీ టీవీని బ్లాక్ చేసింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం