ధరల పెరుగుదల: ఉల్లి ఎగుమతులపై బ్యాన్ విధింపు

By narsimha lodeFirst Published Sep 14, 2020, 10:05 PM IST
Highlights

ఉల్లి ఎగుమతులపై సోమవారం కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశీయంగా ఉల్లి ధరలు విపరీతంగా పెరగడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకొన్నారు.దీంతో ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది.

న్యూఢిల్లీ: ఉల్లి ఎగుమతులపై సోమవారం కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశీయంగా ఉల్లి ధరలు విపరీతంగా పెరగడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకొన్నారు.దీంతో ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది.

అన్ని రకాల ఉల్లిని ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) సోమవారం నాడు నోటిఫికేషన్ జారీ చేసింది.బెంగుళూరు రోజ్, కృష్ణాపురం ఉల్లిపాయల ఎగుమతును కేంద్రం నిషేధం విధించింది. 

ఉల్లి ధరలు పెరిగాయి, మరోవైపు ఉల్లి  కొరత కూడ నెలకొంది. కరోనా నేపథ్యంలో ఉల్లి ఎగుమతులు భారీగా చోటు చేసుకొన్నాయి. 2021 ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్  నుండి జూన్ మధ్య కాలంలో  198 డాలర్ల ఉల్లిని ఎగుమతి చేశారు. 2019-20లో 440 డాలర్ల ఉల్లిని ఎగుమతి చేశారు.

బంగ్లాదేశ్, మలేషియా, యూఏఈ, శ్రీలంకకు ఇండియా నుండి ఉల్లిని ఎగుమతి చేస్తారు. గత ఏడాది కూడ ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. 

click me!