వైసీపీ మద్దతు, టీఆర్ఎస్ దూరం: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్

By narsimha lodeFirst Published Sep 14, 2020, 5:39 PM IST
Highlights

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ గా ఎన్డీఏ అభ్యర్ధి హరివంశ్ సింగ్ ఎన్నికయ్యారు.
 


న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ గా ఎన్డీఏ అభ్యర్ధి హరివంశ్ సింగ్ ఎన్నికయ్యారు.

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికను సోమవారం నాడు నిర్వహించారు. వాయిస్ ఓట్ ద్వారా ఈ ఎన్నిక నిర్వహించారు.ఈ నెల 9వ తేదీన హరివంశ్ సింగ్ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ పదవి కోసం నామినేషన్ దాఖలు చేశారు. 

ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా గురువారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. విపక్షాల అభ్యర్ధిగా మనోజ్ ఝా నామినేషన్ దాఖలు చేశారు.సోమవారం నాడు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికలో హరివంశ్ సింగ్ ఎన్నికైనట్టు రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.ఈ ఎన్నికకు టీఆర్ఎస్ దూరంగా ఉంది. ఎన్డీఏ అభ్యర్ధికి వైసీపీ మద్దతు ప్రకటించింది.

తమ పార్టీ అభ్యర్జికి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని వైసీపీ చీఫ్ ఏపీ సీఎం వైఎస్ జగన్ కు బీహార్ సీఎం నితీష్ కుమార్ మూడు రోజుల క్రితం ఫోన్ చేశారు. ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడ వైసీపీ ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు.హరివంశ్ సింగ్ రెండోసారి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ గా ఎన్నికయ్యారు.


 

click me!