ఢిల్లీ డిప్యూటీ సీఎంకి కరోనా: హోం క్వారంటైన్‌లోనే మనీష్ సిసోడియా

Published : Sep 14, 2020, 08:49 PM IST
ఢిల్లీ డిప్యూటీ సీఎంకి కరోనా: హోం క్వారంటైన్‌లోనే మనీష్ సిసోడియా

సారాంశం

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సిసోడియా ఈ విషయాన్ని తెలిపారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సిసోడియా ఈ విషయాన్ని తెలిపారు.

కరోనా సోకడంతో తాను హోం క్వాంరటైన్ లోకి వెళ్లినట్టుగా ఆయన ప్రకటించారు.  ఆదివారం నాడు రాత్రి సిసోడియాకు అనారోగ్య లక్షణాలు కన్పించాయి. దీంతో ఇవాళ ఉదయం ఆయన కరోనా పరీక్షలు నిర్వహించుకొన్నారు.ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టుగా తేలింది.

 

తాను బాగానే ఉన్నానని ఆయన ప్రకటించారు. తనకు జ్వరం లేదని, ఇతర ఎలాంటి సమస్యలు లేవని ఆయన చెప్పారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగా ఉందని ఆయన చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో తాను త్వరలోనే తిరిగి విధుల్లో చేరుతానని ఆయన ప్రకటించారు.

ఢిల్లీలో సోమవారం నాడు 3,229 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 2.21 లక్షలు రికార్డయ్యాయి. రాష్ట్రంలో కరోనాతో 4,770 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో కరోనాతో 24 మంది మరణించారు.
 

PREV
click me!

Recommended Stories

Codeine Syrup Case : అసెంబ్లీలో దద్దరిల్లిన దగ్గుమందు చర్చ
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే