కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తాం: ఛత్తీస్‌గడ్‌లో రాహుల్ గాంధీ హామీ

By Mahesh K  |  First Published Oct 28, 2023, 8:12 PM IST

రాహుల్ గాంధీ ఛత్తీస్‌గడ్‌లో క్యాంపెయిన్ చేస్తూ కేజీ టు పీజీ హామీ ఇచ్చారు. ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్‌ను మళ్లీ ఎన్నుకుంటే కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని, అందుకు ప్రజలు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు.
 


రాయ్‌పూర్: కేజీ టు పీజీ అనే మాట తెలంగాణకు కొత్తేమీ కాదు. నత్తనడకన ఇది అమలు కూడా అవుతున్నది. ఇటీవలే రాజన్న సిరిసిల్ల కేజీ టు పీజీ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ప్రారంభమైంది. బీఆర్ఎస్ హామీ ఇచ్చిన కేజీ టు పీజీని ఇప్పుడు కాంగ్రెస్ కూడా హామీ ఇచ్చింది. అది ఛత్తీస్‌గడ్‌లో రాహుల్ గాంధీ కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చారు.

కాంకేర్ జిల్లాలోని భాను ప్రతాప్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కేజీ టు పీజీ ఉచిత విద్య హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోబోమని చెప్పారు. ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్‌కు మళ్లీ అధికారాన్ని కట్టబెడితే ఈ హామీ అమలు చేస్తామని ప్రకటించారు.

Latest Videos

undefined

Also Read: అమిత్ షా బీసీ సీఎం హామీపై అసదుద్దీన్ ఒవైసీ స్ట్రాంగ్ కౌంటర్.. ఏమన్నారంటే?

అదే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై రాహుల్ గాంధీ విమర్శలు సంధించారు. ప్రధాని తరుచూ ఓబీసీ సముదాయాన్ని తన ప్రసంగాల్లో గుర్తు చేస్తుంటారని, మరి అలాంటప్పుడు ఆయన ఓబీసీ జనాభా గణన చేపట్టడానికి ఎందుకు జంకుతున్నట్టూ అని నిలదీశారు. ఓబీసీలను మోసపుచ్చుతున్నాడనే విషయం వారు తెలుసుకోవాలని అన్నారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కుల జన గణన చేపడుతామని హామీ ఇచ్చారు. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుల జన గణన చేపట్టడానికి వెనుకాడుతున్నదని ఫైర్ అయ్యారు.

click me!