ఉమన్స్ డే స్పెషల్ : ఈ జంతువుల్లోనూ కష్టం ఆడదానిదే..!

Published : Mar 09, 2023, 10:24 AM IST
 ఉమన్స్ డే స్పెషల్ : ఈ జంతువుల్లోనూ కష్టం ఆడదానిదే..!

సారాంశం

ఈ రెండు జంతువుల్లో కామన్ విషయం ఏమిటంటే.... కుటుంబాన్ని ఆడ జంతువులు మాత్రమే చూసుకుంటాయి. తమ పిల్లలకు ఆహారం కూడా ఇవే సమకూరుస్తాయి.

మహిళల విజయాలను గుర్తించడం, మహిళల సమానత్వం గురించి అవగాహన పెంచడం, లింగ సమానత్వం కోసం లాబీ చేయడం మరియు స్త్రీ-కేంద్రీకృత స్వచ్ఛంద సంస్థల కోసం నిధుల సేకరణ కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే... ఈ ఉమన్స్ డే సందర్భంగా కేవలం మనుషులనే కాదు... జంతువులను కూడా పరిగణ తీసుకోవాల్సిందే. ఈ జంతువలను చూస్తే.... కుటుంబ పోషణ కోసం ఇవి ఇంత కష్టపడుతున్నాయా అని ఆశ్చర్యం కలగకమానదు.

IFS అధికారులు సుశాంత నందా , పర్వీన్ కస్వాన్‌ లు రెండు పోస్టులు షేర్ చేశారు. ఒకరు ఏనుగు జాతి గురించి షేర్ చేయగా... మరొకరు  సింహాల జాతి గురించి పంచుకున్నారు. ఈ రెండు జంతువుల్లో కామన్ విషయం ఏమిటంటే.... కుటుంబాన్ని ఆడ జంతువులు మాత్రమే చూసుకుంటాయి. తమ పిల్లలకు ఆహారం కూడా ఇవే సమకూరుస్తాయి.

 

"సింహాల ప్రైడ్‌లను తరతరాలుగా ఆడవారే నడుపుతున్నారు. వారు కలిసే ఉంటారు. ఒకరినొకరు రక్షించుకుంటారు. ఆడవారు ఎక్కువగా వేట , పిల్లల పెంపకం కూడా చేస్తారు. #అంతర్జాతీయ మహిళా దినోత్సవం" అని సుశాంత నంద షేర్ చేసిన వీడియోకి క్యాప్షన్ గా పెట్టారు. 

 

పర్వీన్ కస్వాన్ ఏనుగుల గుంపు సుందరమైన ఫోటోను పంచుకున్నారు. జాతుల గురించి కొన్ని ట్రివియాలను కూడా ఇచ్చారు. "మీకు తెలుసా # ఏనుగు కుటుంబం మొత్తం మహిళా సమూహం. #తల్లి, #అత్తలు, #అమ్మమ్మ & అన్ని ఇతర #స్త్రీలతోనే ఉంటాయి. పెద్దయ్యాక మగ ఏనుగు.. గుంపును వదిలేసి వెళ్లిపోతుంది. పిల్లలను తల్లి మాత్రమే కాకుండా మందలోని అన్ని ఆడ ఏనుగులు చూసుకుంటాయి. చాలా అనుభవం ఉన్న మహిళలు కుటుంబం కోసం అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. #మహిళా దినోత్సవం,” అంటూ షేర్ చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Government Jobs : రూ.78,800 శాలరీతో 173 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
EPFO : ఈపీఎఫ్‌వో కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు