దేశంలో తగ్గని కోవిడ్ ఉద్ధృతి.. కొత్త‌గా క‌రోనా వైర‌స్ తో 28 మంది మృతి

By Mahesh RajamoniFirst Published Apr 21, 2023, 2:45 PM IST
Highlights

New Delhi: భారతదేశంలో కోవిడ్ -19 పరిస్థితి ఆందోళనకరంగా ఉంది, ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాయి. 
 

India coronavirus update: ప్రస్తుతం పలు దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. భారతదేశంలో కోవిడ్ -19 పరిస్థితి ఆందోళనకరంగా ఉంది, ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో కేసులు క్రమంగా పెరుగుతున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాయి. గత 24 గంటల్లో భారత్ లో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గి 11,692గా నమోదయ్యాయి. దీంతో కరోనా వైరస్ యాక్టివ్ కేసుల సంఖ్య 66,170కి చేరుకుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం... భారతదేశంలో శుక్రవారం 11,692 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఇది అంతకుముందు రోజుతో పోలిస్తే స్వల్ప తగ్గుదలను సూచిస్తుంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 66,170గా ఉంది. 

శుక్రవారం నమోదైన 28 కొత్త మరణాలతో కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి మొత్తం సంఖ్య 5,31,258కి చేరింది. యాక్టివ్ కేసులు ఇప్పుడు మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.15% ఉన్నాయని, జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.67% ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 4.48 కోట్లు (4,48,69,684) కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. కాగా, భారతదేశంలో కోవిడ్ -19 పరిస్థితి ఆందోళనకరంగా ఉంది, ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో, రోజువారీ కోవిడ్ -19 కేసుల సంఖ్య కొద్దిగా తగ్గింది, బుధవారం 1,767 కేసులతో పోలిస్తే గురువారం 1,603 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 26.75 శాతంగా ఉండగా, ముగ్గురు మరణించారు.

హర్యానాలో గురువారం కోవిడ్ -19 కారణంగా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, 1,059 కొత్త కేసులు గుర్తించబడ్డాయి. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 5,099 కు చేరుకుంది. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 10,727కి చేరింది. మహారాష్ట్రలో గురువారం 1,113 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయనీ, ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,129 గా ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులెటిన్ లో పేర్కొంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందారు.

దేశవ్యాప్తంగా కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పీకే మిశ్రా బుధవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆరోగ్య మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్, మందులు, వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ల సన్నద్ధత, ఇటీవల పెరిగిన కోవిడ్ కేసులను ఎదుర్కోవడానికి అవసరమైన చర్యలపై సమావేశంలో చర్చించినట్లు పీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. 

click me!