మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలు #BoycottMaldives హ్యాష్‌ట్యాగ్ వైరల్ అయ్యేలా చేసింది. దీనికి మద్దతుగా ఈజీమైట్రిప్ #ChaloLakshadweep ప్రచారాన్ని ప్రారంభించింది.
ఢిల్లీ : భారత్ గురించి, ప్రధాని నరేంద్ర మోడీ గురించి మాల్దీవుల మంత్రులు చేసిన అవమానకరమైన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఆన్‌లైన్ ట్రావెల్ సంస్థ EaseMyTrip మాల్దీవులకు అన్ని బుకింగ్‌లను నిలిపివేసింది. మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
భారతదేశానికి మద్దతుగా నిలుస్తూ, ఈజ్ మై ట్రిప్ సీఈవో నిశాంత్ పిత్తి ఎక్స్ లో పోస్ట్ చేస్తూ, "మన దేశానికి సంఘీభావంగా, @EaseMyTrip అన్ని మాల్దీవుల విమాన బుకింగ్‌లను నిలిపివేసింది."
undefined
2008లో నిశాంత్ పిత్తి, రికాంత్ పిత్తి, ప్రశాంత్ పిత్తి అనే ముగ్గురు సంయుక్తంగా ఈజ్ మై ట్రిప్ సంస్థను స్థాపించారు. ఈ ఘటన నేపథ్యంలో మాల్దీవులకు బదులు లక్షద్వీప్‌కు పర్యాటకాన్ని ప్రోత్సహించే ప్రచారాన్ని ప్రారంభించింది.
ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు.. మల్దీవుల సంచలన నిర్ణయం.. ముగ్గురు మంత్రులు సస్పెండ్..
కించపరిచే వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ సంఘటనలు #BoycottMaldives హ్యాష్‌ట్యాగ్‌కు మరింత బలాన్ని చేకూర్చాయి. భారతీయ పర్యాటకులు కూడా మాల్దీవుల పర్యటనలను పెద్ద ఎత్తున రద్దు చేసుకున్నారు. ఈ వివాదంపై భారతీయ ప్రముఖులు కూడా స్పందించారు.
మాల్దీవులకు వెళ్లే బదులు.. దేశంలో అనేక సుందరమైన పర్యాటక ప్రదేశాలున్నాయని.. అక్కడికి వెళ్లడానికి ప్రయత్నించాలని ప్రజలను కోరారు. మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మంత్రులు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ అభిప్రాయాలను ప్రతిబింబించవని పేర్కొంది.
In solidarity with our nation, has suspended all Maldives flight bookings ✈️ https://t.co/wIyWGzyAZY
— Nishant Pitti (@nishantpitti)