మాజీ సీఎంపై అభ్యంతరకర పోస్టు.. ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌పై ఎఫ్ఐఆర్

Published : Dec 01, 2021, 02:22 PM IST
మాజీ సీఎంపై అభ్యంతరకర పోస్టు.. ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌పై ఎఫ్ఐఆర్

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లో ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌పైనా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌పై అభ్యంతరకర పోస్టు పెట్టారనే అభియోగాలతో కన్నౌజ్‌ జిల్లాలో ఓ కేసు నమోదైంది. అందులో ఫేస్‌బుక్ పేజీ అడ్మిన్‌తోపాటు ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ పేరు కూడా ఉన్నది. ఆ తర్వాత దర్యాప్తు మొదలయ్యాక మార్క్ జుకర్‌బర్గ్ పేరును తొలగించినట్టు పోలీసులు వెల్లడించారు.  

న్యూఢిల్లీ: Facebookలో ఏవైనా అభ్యంతరకర(Defematory) పోస్టులు, విద్వేషాలు సృష్టించే పోస్టులు పెడితే కేసులు నమోదవడం ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం. వాట్సాప్ స్టేటస్‌లపైనా ఇటీవలే టీమిండియాపై పాకిస్తాన్ క్రికెట్ జట్టు గెలిచినప్పుడు కేసులు ఫైల్ కావడాన్ని చూశాం. అయితే, ఈ కేసులు పోస్టు చేసిన వ్యక్తులపై నమోదయ్యాయి. కానీ, Uttar Pradeshలో ఇందుకు అదనంగా ఏకంగా ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌(Mark Zuckerberg)పైనే FIR నమోదైంది. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌పై అభ్యంతరకర పోస్టుకు సంబంధించిన ఘటనలో మార్క్ జుకర్‌బర్గ్‌పైనా ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే, ఈ పోస్టును మార్క్ జుకర్‌బర్గ్ చేయలేదు. కానీ, అభ్యంతరకర మెస్సేజ్ పోస్టు చేయడానికి ఫేస్‌బుక్‌ను ఎంచుకున్నారు కాబట్టే, ఆ  సంస్థ సీఈవోపైనా ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌పై అభ్యంతరకర పోస్టులు పెట్టారని కన్నౌజ్ జిల్లా సారహతి గ్రామానికి చెందిన అమిత్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈయన ఫిర్యాదుతో మొత్తం 49 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. సమాజ్ వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ప్రతిష్టను దెబ్బ తీయాలనే లక్ష్యంతోనే వారు పోస్టు పెట్టారని అమిత్ కుమార్ ఆరోపించారు. బువా బబువా అనే టైటిల్‌తో ఫేస్‌బుక్‌లో పేజీ క్రియేట్ చేశారని కోర్టు ముందు వినిపించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యర్థులుగా పేరుగాంచిన బీఎస్పీ చీఫ్ మాయవతి, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌లు 2019 పార్లమెంటరీ ఎన్నికల కోసం జట్టు కట్టినప్పుడు వారిద్దరినీ ఎగతాళిగా బువా బబువా అనే పదం కాయిన్ చేసినట్టు తెలిసింది.

Also Read: Noida International Airport ఉత్తర భారతదేశానికి లాజిస్టిక్స్ గేట్‌వే అవుతుంది.. శంకుస్థాపన కార్యక్రమంలో మోదీ

ఈ కేసులో దర్యాప్తు మొదలైన తర్వాత ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ పేరును పోలీసులు ఎత్తేశారు. ఇప్పుడు ఆ ఫేస్‌బుక్ పేజీ అడ్మినిస్ట్రేటర్‌పై దర్యాప్తు జరుగుతున్నట్టు జిల్లా సీనియర్ పోలీసు అధికారి వివరించారు. తొలుత అఖిలేశ్ యాదవ్‌పై అసభ్య పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు చేయాలని అమిత్ కుమార్ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. మే 25న ఆయన అప్లికేషన్ పెట్టుకున్నా పోలీసులు ఖాతరు చేయలేదు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత అమిత్ కమార్ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు రూలింగ్ తర్వాత అమిత్ కుమార్ పోలీసులను ఆశ్రయించి పేజ్ అడ్మిన్‌తోపాటు ఫేస్‌బుక్ సీఈవోపైనా ఫిర్యాదు చేశారు.

Also Read: మార్చురీ గదిలో ప్రాణాలతో లేచిన మనిషి.. ట్రీట్‌మెంట్‌ పొందుతూ మరణం

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు బీజేపీ, మరోవైపు సమాజ్ వాదీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. రైతుల అంశాన్ని ప్రధానంగా తీసుకుని కాంగ్రెస్ ఈ ఎన్నికల బరిలోకి దిగేలా కనిపిస్తున్నది. కాగా, బీజేపీ తర్వాత రాష్ట్రంలో నెంబర్ 2 పొజిషన్‌లో సమాజ్ వాదీ పార్టీనే ఉన్నట్టు కనిపిస్తున్నది. బీజేపీ కూడా సమాజ్ వాదీ లక్ష్యంగానే విమర్శలు చేస్తున్నది. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటికే రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్