
Pregnant Man:వైద్యరంగంలో కొన్నిసార్లు ఆశ్చర్యకరమైన సంఘటనలు, వింత కేసులు తెరపైకి వచ్చాయి. ఆ ఘటనలు మనల్ని ఎంతగానో గందరగోళానికి గురిచేస్తాయి. కొన్ని సందర్బాల్లో సైన్స్ కూడా సవాల్ విసురుతాయి. అలాంటి ఘటననే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది. 36 వ్యక్తి గర్బం దాల్చిన కేసు వెలుగులోకి వచ్చింది. వ్యక్తి ఏంటీ గర్బం దాల్చడమేంటని అనుకుంటున్నారు. మీరు చదివింది నిజమే..
ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. పుట్టినప్పటి నుంచి అతడి కడుపులో కవలలు పెరుగుతున్నారు. మొదట్లో ఆ వ్యక్తి కడుపులో కణితి ఉందని వైద్యులు భావించారు, కానీ అతనికి శస్త్రచికిత్స చేయగా.. అతడి కడుపులో కవల పిండాలు చనిపోయినట్లు గుర్తించారు. ఇది 1999 నాటి సందర్భం. 21వ శతాబ్దం ప్రారంభంలో ఈ వైద్య కేసు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా చర్చించబడింది
మీడియా నివేదికల ప్రకారం.. నాగ్‌పూర్‌కు చెందిన 36 ఏళ్ల రైతు సంజు భగత్ .. అతనికి చిన్నప్పటి నుండి తరుచు కడుపు నొప్పి అంటూ ఫిర్యాదు ఉండేది. కానీ అతను 36 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి అతను చాలా కలత చెందాడు. పెరుగుతున్న పొట్టను చూసి .. సంజును 'ప్రెగ్నెంట్ మ్యాన్' అని అతడ్ని ఆటపట్టించేవారు. కానీ, సరదాగా అతడ్ని ఆట పట్టిన మాటలు నిజమవుతాయని కలలో కూడా ఎవరూ అనుకోలేదు. సంజు కడుపు క్రమంగా పెరుగుతూ వచ్చింది. అప్పడప్పుడూ శ్వాస ఆడకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడేవాడు.
శస్త్రచికిత్స సమయంలో ఆశ్చర్యపోయిన వైద్యులు
1999వ సంవత్సరంలో ఒకరోజు సంజు హఠాత్తుగా స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతన్ని ఎమర్జెన్సీకి చేర్చారు. సంజు కడుపులో పెద్ద కణితి ఉందని మొదట్లో అనుకున్నారు. వైద్యులు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అతడికి శస్త్ర చికిత్స చేస్తున్న సమయంలో కడుపు లోపలి దృశ్యాన్ని చూసి వైద్యులు సైతం ఆశ్చర్యపోయాడు. సంజు కడుపులో కవలల అవయవాలు ఛిద్రమైనట్లు వైద్యులు గుర్తించారు.
హిస్టరీ డిఫైన్డ్ ప్రకారం.. భగత్ కడుపులో పిండాన్ని పోలిన ఆకృతిని డాక్టర్లు గుర్తించారు. అతడి కడుపులో చాలా ఎముకలు కనిపించాయి. ఆపై కొన్ని ప్రైవేట్ భాగాలు, వెంట్రుకలు, చేతులు, దవడలు బయటకు వచ్చాయి. ఈ ఘటనతో ఆపరేషన్ చేసే డాక్టర్ టీం ఒక్కసారిగా షాక్ అయ్యింది. సంజు పుట్టినప్పటి నుంచి ఈ కవలలు కడుపులోనే పెరుగుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. శస్త్ర చికిత్స అనంతరం సంజూ సాధారణ జీవితం గడుపుతున్నాడు.
పిండంలో పిండం (FIF) అంటే ఏమిటి?
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సంజుకి పుట్టబోయే బిడ్డ చాలా అరుదైన వైద్య పరిస్థితి పిండం (ఎఫ్‌ఐఎఫ్) కారణంగా వచ్చింది. ఈ కేసును వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అని డాక్టర్ పేర్కొన్నాడు. తల్లి కడుపులో ఒకటి కంటే ఎక్కువ పిల్లలు పెరుగుతున్నప్పుడు.. కొన్ని సందర్భాల్లో ఒక పిండం మరొక బిడ్డ లోపల పెరగడం ప్రారంభమవుతుంది. పిల్లల కడుపు లోపల పెరుగుతున్న పిల్లవాడు నిజానికి దాని కవల. అక్కడ వారు పరాన్నజీవిలా అతనిని తింటున్నారు. ఇది చాలా విచిత్రం. కోట్లలో ఒకరికి జరుగుతుందని తెలిపారు.