HD Deve Gowda's wife: మాజీ ప్రధాని దేవెగౌడ భార్యకు ఐటీ నోటీసులు

Published : Mar 28, 2022, 11:01 PM IST
HD Deve Gowda's wife: మాజీ ప్రధాని దేవెగౌడ భార్యకు ఐటీ నోటీసులు

సారాంశం

HD Deve Gowda's wife: మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ భార్య,  క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార‌స్వామి త‌ల్లి చెన్నమ్మకు ఆదాయం పన్ను( I-T ) శాఖ నోటీసులు ఇచ్చింది. ఆమె ఆస్తికి సంబంధించి ఐటీ శాఖ ఈ నోటీసులిచ్చింది. ఈ విషయాన్ని దేవెగౌడ  కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌డీ రేవన్న సోమవారంనాడు తెలిపారు.  

HD Deve Gowda's wife: మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ భార్య చెన్నమ్మకు ఆదాయం పన్ను( I-T ) శాఖ నోటీసులు ఇచ్చింది. ఆమె ఆస్తికి సంబంధించి ఐటీ శాఖ ఈ నోటీసులిచ్చింది. ఈ విషయాన్ని దేవెగౌడ  కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌డీ రేవన్న సోమవారంనాడు తెలిపారు.

“వారు (ఐ-టి) మాకు నోటీసు జారీ చేయనివ్వండి. ఇప్పుడు అమ్మకు నోటీసులు జారీ చేశారు. మా భూమిలో చెరకు పండిస్తున్నాం. వాళ్ళు వచ్చి చూడాలి.” అని హసన్‌ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ రేవన్న చెప్పారు. ఐటీ నోటీసులు ఇచ్చింది ఒక మాజీ ప్రధాని సతీమణికి అని, ఆ విధంగా చేసి ఉండకూడదని మాత్రం తాను చెప్పనని అన్నారు. ప్రతి ఎకరా భూమిలో తాము ఎలాం పంట పండిస్తున్నామో అధికారులు వచ్చి చూస్తే బాగుంటుదన్నారు.

 నాకు సమాచారం లేదు: మాజీ సీఎం కుమారస్వామి
 
కాగా, తన తల్లికి I-T శాఖ నోటీసు ఇచ్చినట్టు తనకు ఎలాంటి సమాచారం లేదని దేవెగౌడ కుమారుడు, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. నోటీస్ గురించి త‌న దగ్గర ఎటువంటి సమాచారం లేదని అన్నారు. ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసినప్పటికీ, దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదని అన్నారు. తమ కుటుంబంలో ఏ పని జరిగినా అందరికీ తెలిసే జరుగుతుందని, ఎలాంటి దాప‌రికాలు ఉండవని, తెరిచిన పుస్తకం లాంటివని కుమారస్వామి అన్నారు. నోటీసులకు తగిన సమాధానం ఇస్తామని చెప్పారు. 60 ఏళ్ల రాజకీయ జీవితంలో దేవెగౌడ ఎప్పుడూ డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వలేదని, తాము కూడా అంతేనని తెలిపారు. కాగా, ఈ నోటీసులపై ఐటీ శాఖ ఇంకా స్పందించాల్సి ఉంది.

బెంగళూరులోని జేడీఎస్ ప్రధాన కార్యాలయంలో మాజీ ప్రధాని దేవెగౌడ శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ పార్టీని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాను. ప్ర స్తుత రాజ కీయ ప రిణామాలు ప్ర స్తావిస్తే హెచ్ డీడీ, ఐదు రాష్ట్రాల ఎన్నిక ల ఫ లితాలు అంద రికీ తెలిసిందే. మాది ప్రాంతీయ పార్టీ, కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దీనిని ఎగతాళి చేసేందుకు కాంగ్రెస్ ఈ వార్తా సమావేశాన్ని పిలవలేదు. మోదీ నేతృత్వంలోని మెజారిటీతో బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చింది. ఇప్పటి వరకు ప్రభుత్వం చేసిందేమీ లేదన్నది వాస్తవం.

PREV
click me!

Recommended Stories

పౌర విమానయాన శాఖపై సభ్యుల ప్రశ్నలు | Minister Ram Mohan Naidu Strong Reply | Asianet News Telugu
PM Modi Inaugurates Safran Aircraft Engine Services India | Modi Speech | Asianet News Telugu